నేటితో ముగియనున్న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన.. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయా దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశం అవుతున్నారు. శుక్రవారం వరకు అమెరికాలో పర్యటించిన రేవంత్ రెడ్డి శనివారం నుంచి దక్షిణ కొరియాలలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో రేవంత్ రెడ్డి పర్యటన సాగుతోంది. మంగళవారంతో దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగియనుంది.

Revanth Reddy's team on foreign tour

విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి బృందం

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయా దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశం అవుతున్నారు. శుక్రవారం వరకు అమెరికాలో పర్యటించిన రేవంత్ రెడ్డి శనివారం నుంచి దక్షిణ కొరియాలలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో రేవంత్ రెడ్డి పర్యటన సాగుతోంది. మంగళవారంతో దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగియనుంది. ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి బిజీ బిజీగా తిరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను ఆయా దేశాలకు చెందిన వ్యాపార రంగ దిగ్గజాలకు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తున్నారు. సీఎంతోపాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి సైతం ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన.. పరిశ్రమలు రాని వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో దక్షిణ కొరియా పెట్టుబడులను రేవంత్ రెడ్డి సాధించగలిగారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ప్రతినిధులు వెల్లడించారు. కొరియాలో పలు కంపెనీలు, వివిధ వ్యాపార, వాణిజ్య సముదాయాలు ప్రతినిధులతో చర్చలను జరిపారు.

కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ చైర్మన్ కియా సాంగ్, వైస్ చైర్మన్ సహ 25 అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతల రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దిగజా ఆటోమోటివ్ కంపెనీ హోండా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. భారత్ లోనే హోండా మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ద్వారా ఒక మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి బృందానికి హామీ ఇచ్చారు. పర్యటనలో చివర రోజైన మంగళవారం ఫ్యూచర్ హాంగ్గాంగ్ ప్రాజెక్ట్ హెడ్ క్వార్టర్ కు రేవంత్ బృందం వెళ్ళనుంది. సన్ రివర్ ప్రాజెక్టు డిప్యూటీ మేయర్ తో భేటీ కానున్నారు. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్ తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. సామ్సంగ్ ప్రతినిధులతో లంచ్ మీటింగ్ సమావేశం ఉంది. ఎల్జి ఎలక్ట్రానిక్స్ సీనియర్ లీడర్స్ తో చర్చలు నిర్వహించనున్నారు. శామ్సంగ్ హెల్త్ కేర్ యూనిట్ తో భేటీ కానున్నారు. కాల్ టెక్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడులపై చర్చలు జరపనుంది. అనంతరం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని రేవంత్ టీమ్ సందర్శించనుంది. హన్ రివర్ ఫ్రంట్, హన్ రివర్ పార్క్ ఫీల్డ్ విజిట్ చేయనుంది. మంగళవారం రాత్రికి రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ కు తిరిగి పయనం కానుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్