పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన.. ఈసారి ఎక్కడికి అంటే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడం లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఎక్కడి నుంచి అయితే పెట్టుబడులు భారీగా వస్తాయి అని భావిస్తున్నారు ఆయా దేశాలకు వెళ్లి పెట్టుబడుదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల కిందట అమెరికాతోపాటు అనేక దేశాల్లో పర్యటించిన ఆయన కీలక ఒప్పందాలను చేసుకున్నారు. తాజాగా మరోసారి పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా విదేశీ పర్యటనకు రేవంత్ రెడ్డి వెళుతున్నారు. ఈసారి పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు కూడా జపాన్ పర్యటనకు వెళ్ళనున్నారు.

CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడం లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఎక్కడి నుంచి అయితే పెట్టుబడులు భారీగా వస్తాయి అని భావిస్తున్నారు ఆయా దేశాలకు వెళ్లి పెట్టుబడుదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల కిందట అమెరికాతోపాటు అనేక దేశాల్లో పర్యటించిన ఆయన కీలక ఒప్పందాలను చేసుకున్నారు. తాజాగా మరోసారి పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా విదేశీ పర్యటనకు రేవంత్ రెడ్డి వెళుతున్నారు. ఈసారి పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు కూడా జపాన్ పర్యటనకు వెళ్ళనున్నారు. గతంలో ముఖ్యమంత్రి అమెరికా పర్యటన విజయవంతం కావడంతో ఈసారి మరింత ఉత్సాహంగా జపాన్ పర్యటనకు వెళ్లబోతోంది. జపాన్లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధితో పాటు తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చే లక్ష్యంతో ఆయన జపాన్ పర్యటనకు వెళ్తున్నారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా వారిని కోరే అవకాశం ఉంది. ఒసాకలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్పోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులపై జపాన్ కంపెనీలకు వివరించి పెట్టుబడులను ఆహ్వానించే అవకాశం ఉంది. పెట్టుబడుదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అక్కడ పెట్టుబడిదారులకు వివరించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరుందిన భారీ కంపెనీలో ముందుకు వస్తున్న విషయాన్ని అక్కడ వారికి వివరించనన్నారు. ఈసారి పర్యటనలో జపాన్ సంస్థల పెట్టుబడులతో రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి పెరగడంతో పాటు రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. 

సీఎం రేవంత్ రెడ్డి జపాన్ షెడ్యూల్ ఇదే..

రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడం లక్ష్యంగా జపాన్ పర్యటనకు వెళుతున్న సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు.  ఏప్రిల్ 15 నుంచి 23 వరకు సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 15వ తేదీలోపు డీ లిమిటేషన్ పై హైదరాబాదులో రెండో సమావేశాన్ని నిర్వహించే అర్చనలు ఆయన ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లి అక్కడ నుంచి జపాన్ పర్యటనకు వెళ్తారని అధికారి వర్గాలు చెబుతున్నాయి. గతంలో కంటే ఎక్కువ పెట్టుబడును ఆకర్షించడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఇప్పటికే జపాన్ లో ఉన్న తెలంగాణకు చెందిన ప్రముఖులతోనూ ఈ మేరకు అధికారులు సంప్రదింపులో జరిపినట్లు చెబుతున్నారు. భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఈ పర్యటనకు ఏర్పాటు చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్