కెసిఆర్ ప్రభుత్వంలో అడ్డగోలుగా అవినీతి జరిగిందని తాము నిరూపిస్తామని, విచారణకు భారతీయ రాష్ట్ర సమితి సిద్ధంగా ఉందా..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అడ్డగోలుగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నేతలు.. తాము చేసిన అవినీతిపైన నోరు విప్పాలని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి
కెసిఆర్ ప్రభుత్వంలో అడ్డగోలుగా అవినీతి జరిగిందని తాము నిరూపిస్తామని, విచారణకు భారతీయ రాష్ట్ర సమితి సిద్ధంగా ఉందా..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అడ్డగోలుగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నేతలు.. తాము చేసిన అవినీతిపైన నోరు విప్పాలని స్పష్టం చేశారు. గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీష్ రావు అమ్మకాల లెక్కలు చెప్పడం లేదంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు శిక్షించిన బీఆర్ఎస్ నేతల ఆలోచనల్లో మార్పు రాలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను ఏడువేల కోట్లకు అమ్మేశారని దుయ్యబట్టారు. పదేళ్లలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయలేదని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకున్నారని, కానీ ఈ జిల్లాకు సాగునీరు మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాను ఎడారి ప్రాంతంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ నేతలకు దక్కుతుందన్నారు. బతుకమ్మ చీరలు అని చెప్పి సూరత్ నుంచి కిలోలు లెక్కన తీసుకువచ్చి పంపిణీ చేశారని ఆరోపించారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సభ్యులు మాట్లాడే తప్పులను సరి చేసే బాధ్యత తనకు ఉందని, సభలో అబద్ధాలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. 2018 డిసెంబర్ లోపే విద్యుత్ మీటర్లు బిగిస్తామని కేంద్రానికి కేసీఆర్ చెప్పారని, అధికారిక లెక్కలు చూసి హరీష్ రావు దీనిపై స్పందించాలని స్పష్టం చేశారు. పదేళ్లపాటు తెలంగాణలోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, కోట్లాది రూపాయల స్కాములు చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.