తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. జాబ్ కేలండర్ విడుదలపై ఆయన కీలక ప్రకటన చేశారు. జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు మేలు చేసే జాబ్ కేలండర్‌ను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తామన్నారు. క్యాలెండర్ విడుదల తరువాత ఉద్యోగాల భర్తీ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇస్తామని ప్రకటించారు.
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. జాబ్ కేలండర్ విడుదలపై ఆయన కీలక ప్రకటన చేశారు. జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు మేలు చేసే జాబ్ కేలండర్‌ను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తామన్నారు. క్యాలెండర్ విడుదల తరువాత ఉద్యోగాల భర్తీ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇస్తామని ప్రకటించారు. మార్చి నెలాఖరు వరకు అన్ని శాఖల్లోని ఖాలీలు వివరాలు తెప్పిస్తామన్న సీఎం.. ఏటా ఇదే విధంగా నోటిఫికేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. జాబ్ కేలండర్‌కు చట్టబద్ధత ఉంటుందని, ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలకు ఖాళీలు ప్రకారం ఎలా నోటిఫికేషన్లు వస్తాయో తెలంగాణలోనూ అలాగే ఉద్యోగాల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు.
గ్రూప్ 2, 3 పరీక్షలు వాయిదా వేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారని, గడిచిన పదేళ్లుగా ఉద్యోగాల భర్తీ లేదని, తీస్తున్న ఉద్యోగాలను వాయిదా వేయాలని డిమాండ్ చేయడం ఎందుకన్నారు. పకడ్బందీగా నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తుంటే కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్లు నిర్వాహకులు పరీక్షలు వాయిదా కోసం తపిస్తున్నారని ఆరోపించారు. పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ దీక్షలు చేసిన వాళ్లు ఏ పరీక్షకు రాయడం లేదన్నారు. గ్రూప్-1 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ప్రకారం ఉంటుందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే 1:50 రేషియోలో ఉద్యోగాల భర్తీ ఉంటుందని వెల్లడించారు. 1:100 చొప్పున పిలవాలని కొందరు కోరుతున్నారని, అలా పిలవడానికి తమకు ఇబ్బంది లేదన్నారు. కానీ, కోర్టుల్లో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్ధేశంతో ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలోనే స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామన్న రేవంత్ రెడ్డి.. దానికి అటానమస్ హోదా కూడా ఇస్తామన్నారు. ఫార్మా, ఐటీ తరువాత ఏఐ ప్రపంచాన్ని నడిపించబోతోందని, రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఏఐకు సంబంధించిన కోర్సులు ప్రవేశపెట్టాలని ఆదేశించారు.