బీసీ నేతలతో నేడు భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి.. కీలక అంశాలపై చర్చ

సీఎం రేవంత్ రెడ్డి శనివారం కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రజాభవంలో టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ఆయన బీసీ నాయకులతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా దేశంలో ఎవరూ చేయని విధంగా బీసీలకు తమ ప్రభుత్వం చేస్తున్న మేలును బీసీ విభాగం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన సూచించే అవకాశం ఉంది.

 CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి 

సీఎం రేవంత్ రెడ్డి శనివారం కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రజాభవంలో టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ఆయన బీసీ నాయకులతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా దేశంలో ఎవరూ చేయని విధంగా బీసీలకు తమ ప్రభుత్వం చేస్తున్న మేలును బీసీ విభాగం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన సూచించే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు మేలు చేకూర్చే రీతిలో చేపట్టిన కుల గణన గురించి ప్రత్యేకంగా బీసీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనన్నారు. కుల గణన వల్ల బీసీలకు అనేక విధాలుగా మేలు చేకూరుతుందని విషయాన్ని వారికి తెలియజేయనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం త్వరలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బీసీ నేతలకు దీనికి సంబంధించి కర్తవ్య బోధ సీఎం రేవంత్ రెడ్డి చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులను పిసిసి ఆహ్వానిస్తుంది.

సీఎం రేవంత్ రెడ్డి వారికి దిశా నిర్దేశం చేయడంతో పాటు.  బీసీల్లో పార్టీ పట్టు నిలుపుకునేందుకు ఏం చేయాలన్న దానిపైన కీలక అభిప్రాయాలను తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు అయిన తర్వాత బీసీలకు చేకూరిన లబ్ధి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేలా బీసీ నాయకులకు ఆయన సూచనలు చేయనున్నారు. రానున్న రోజుల్లో కుల గణన వల్ల బీసీలకు ఏ స్థాయిలో లబ్ధి చేకూరుతుందో వంటి వివరాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వారికి తెలియజేయనున్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను బీసీ నాయకులు తీసుకోవాలని ఆయన ఆదేశించే అవకాశం ఉంది. పార్టీలోనూ బీసీ నాయకులకు కీలక బాధ్యతలను అప్పగిస్తామన్న హామీను కూడా ఆయన ఇవ్వనున్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ సందర్భంగా నాయకులకు అవకాశం కల్పిస్తామని, గట్టిగా పనిచేయాలని వారందరికీ సూచించే అవకాశం ఉంది. 

రేపు యాదగిరి గుట్టకు సీఎం రేవంత్ రెడ్డి..

యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఈనెల 23న సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో భాస్కరరావు సమాచారాన్ని వెల్లడించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యాదగిరిసుడు స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. బంగారు తాపడంతో తయారుచేసిన శ్రీ నృసింహ అవతారాలు, కేశవ నారాయణ మూర్తులు, గరుడమూర్తులు, ఇతర దేవతమూర్తుల విగ్రహాలకు వాన మామలై మఠం 31వ పీఠాధిపతులు శ్రీ మధుర కవి రామానుజ జీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో ఉదయం 11 54 గంటలకు మహా కుంభాభిషేక సంప్రోక్షణ పూజలు జరిపనున్నారు. అనంతరం రామానుజ జీయర్ స్వామీజీతో కలిసి ముఖ్యమంత్రి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించి శ్రీ స్వామివారికి అంకితమిస్తారని వెల్లడించారు. సీఎం ఈనెల 23న ఉదయం 10:30 గంటలకు హెలికాప్టర్ ద్వారా యాదగిరి గుట్టకు చేరుకుంటారని, అక్కడి నుంచి కొండపైన విఐపి గెస్ట్ హౌస్ లోకి వెళ్లి సాంప్రదాయ దుస్తులతో యాగశాలలో నిర్వహించే మహా పూర్ణాహుతి వేడుకల్లో పాల్గొంటారని వెల్లడించారు. తర్వాత ఉత్తర ద్వారం నుంచి ఆలయ విమాన గోపురం వద్దకు వెళ్ళనున్నట్లు ఆలయ అధికారులు సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్