నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం.. కీలక అంశాలపై దిశా నిర్దేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో సోమవారం సచివాలయంలో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కలెక్టర్ల సదస్సును ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యాలను వివరించడంతోపాటు అధికారుల నుంచి కూడా కీలక సమాచారాన్ని ఆయన తెలుసుకునే అవకాశం ఉంది.

CM Chandrababu Naidu

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో సోమవారం సచివాలయంలో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కలెక్టర్ల సదస్సును ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యాలను వివరించడంతోపాటు అధికారుల నుంచి కూడా కీలక సమాచారాన్ని ఆయన తెలుసుకునే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కలెక్టర్ల సదస్సును ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సదస్సుపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. కొద్దిరోజుల కిందటే కలెక్టర్ల బదిలీలను నిర్వహించిన చంద్రబాబు నాయుడు.. తొలిసారి వీరితో నేరుగా సమావేశం అవుతున్నారు. గత ప్రభుత్వ విధానాలను పునః పరిశీలన చేయాల్సిన అంశాలపైన కలెక్టర్లకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికను కూడా కలెక్టర్ల దృష్టికి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తీసుకువెళ్లనున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, వైయస్సార్, అన్నమయ్య, ప్రకాశం, సత్యసాయి జిల్లాలో ప్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ ఎక్కువగా జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ఆయా జిల్లా కలెక్టర్లకు చంద్రబాబునాయుడు దిశానిద్దేశం చేసే అవకాశం ఉంది. రెవిన్యూ సిబ్బంది ద్వారా వీటిల్లో జరిగిన అక్రమాలను బయటకు తీయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

వ్యవసాయ భూముల కన్వర్షన్ బాధ్యతలను సైతం కలెక్టర్లకు అప్పగించే అవకాశం ఉంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక పత్రాల దహనం కేసు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కీలక పత్రాలను అత్యంత జాగ్రత్తగా ఉంచాలని కలెక్టర్లకు సీఎం సూచించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక పథకాల అమలుకు సంబంధించి కొద్ది రోజుల్లోనే నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో వాటిని జిల్లా స్థాయిలో పటిష్టంగా అమలు చేయడంపై అధికారులకు ఆయన కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడుదారులు ఆకర్షించేందుకు జిల్లాల వారీగా అనుసరించాల్సిన వ్యూహాల పైన ఈ సందర్భంగా చర్చించనున్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుగుణంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే ఇబ్బందులు నెలకొన్నాయి. ముఖ్యంగా రహదారి సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను గిరిజనులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో రహదారుల కల్పనకు సంబంధించి ప్రత్యేకంగా తీసుకోవాల్సిన చర్యలు పైన ఏజెన్సీకి చెందిన జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు నాయుడు మరింత క్షుణ్ణంగా చర్చించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వం చేసిన అడ్డగోలు వ్యవహారాలపై విచారణలకు సంబంధించి కలెక్టర్లు అందించాల్సిన సమాచారం, ఆయా జిల్లాల్లో శాంతిభద్రతలు పరిరక్షణకు సంబంధించి అనుసరించాల్సిన విధానాలపైన సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్