ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలి.. కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన సీఎం చంద్రబాబు

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజైన శుక్రవారం ముఖ్య నాయకులను ఆయన కలిసి ఒక అంశాలపై వినతి పత్రాలను సమర్పించారు. గురువారం ప్రధాన మోడీతోపాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు నాయుడు.. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను శుక్రవారం కలిశారు.

CM Chandrababu, MPs with Nirmala Sitharaman

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు, ఎంపీలు


ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజైన శుక్రవారం ముఖ్య నాయకులను ఆయన కలిసి ఒక అంశాలపై వినతి పత్రాలను సమర్పించారు. గురువారం ప్రధాన మోడీతోపాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు నాయుడు.. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను కేంద్ర మంత్రికి వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ దుస్పరిపాలన కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్ర అవసరాలపై మెమొరాండాన్ని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రికి సమర్పించారు. ఏపీకి నిధులు కేటాయింపులు ఎందుకు పెంచాలో అందులో ఆయన వివరించారు. సుమారు గంటపాటు ఆర్థికశాఖ మంత్రితో సీఎం చంద్రబాబు నాయుడు కీలక అంశాలపై చర్చించారు. అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, అభివృద్ధి దిశగా పయనించేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని కోరారు.

పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు అమరావతి,  ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆయన కోరారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. 2023 - 24 లో రాష్ట్ర అప్పులు జిఎస్డిపిలో 33.32 శాతానికి చేరుకున్నాయని వెల్లడించారు. 2019 - 20 లో అది 31.2 శాతానికి ఉందని సీఎం గుర్తు చేశారు. పెండింగ్ లో ఉన్న విభజన అంశాలను పరిష్కరించాలని నిర్మలా సీతారామన్ ను ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. వీలైనంతవరకు కేంద్రం నుంచి ఆర్థిక భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామన్న భరోసాను ఆమె కల్పించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్