నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రధానితో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాన మోడీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం వంటి అంశాలపై ప్రధానితో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Chief Minister Chandrababu Naidu

 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాన మోడీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం వంటి అంశాలపై ప్రధానితో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ నుంచి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళనున్నారు. గురువారం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ప్రధాని మోడీతో సమావేశం అనంతరం హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, జేపీ నడ్డాలను కలిసే అవకాశం ఉంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటుకు సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు వంటి అంశాలు అమలుకు సహాయం అందించాలని చంద్రబాబు కోరే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బాబు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. చంద్రబాబుతోపాటు మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లానున్నారు. 

పాలనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్న చంద్రబాబు 

గతంతో పోలిస్తే ఈసారి పాలనలో సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అధికారులకు, నాయకులు కూడా ఈ మేరకు ఆయన ఎలా ఉండాలన్న దానిపై స్పష్టమైన ఆదేశాలను అందించారు. రెండు రోజుల కిందట పెన్షన్లు పంపిణీ సందర్భంగా నిర్వహించిన సమావేశంలోనూ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 1995 నాటి చంద్రబాబును చూస్తారని వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పట్టించడంతోపాటు సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తానని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం నుంచి వీలైనంత సహకారాన్ని పొందేందుకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ కార్యాచరణ ఉంటుందని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్