ఈ నెల 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం

రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 175 స్థానాలకుగాను 164 స్థానాల్లో విజయ దుందుబి మోగించిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ 11 స్థానాలకు పరిమితై ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.

Nara Chandrababu

నారా చంద్రబాబు 

రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 175 స్థానాలకుగాను 164 స్థానాల్లో విజయ దుందుబి మోగించిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ 11 స్థానాలకు పరిమితై ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. కూటమి అద్భుత విజయాన్ని నమోదు చేయడంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఈ నెల 12వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు సాగుతున్నాయి. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే, అదే రోజు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుండడంతో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడినట్టు చెబుతున్నారు.

ఇదిలా, ఉంటే విభజిత రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబే పని చేయగా, రెండోసారి జరిగిన ఎన్నికల్లో జగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అద్భుత విజయాన్ని నమోదు చేయడంతో మూడోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా, ఉంటే మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు నాలుగో విడత ముఖ్యమంత్రి కానున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లపాటు సీఎంగా పని చేసిన ఆయన.. విభజిత రాష్ట్రానికి తొలి ఐదేళ్లు సీఎంగా పని చేశారు. తాజాగా మరోసారి ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్