కీలక హామీలు అమలు దిశగా చంద్రబాబు.. రేపు పలు ఫైళ్లపై సంతకాలు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక హామీలను ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తామని, అందుకు అనుగుణంగా ఆయా ప్రోగ్రామ్స్‌ అమలుకు సంబంధించిన ఫైళ్లపై తొలి సంతకాలు చేస్తామని ప్రకటించారు.

Nara Chandrababu

నారా చంద్రబాబు 

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక హామీలను ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తామని, అందుకు అనుగుణంగా ఆయా ప్రోగ్రామ్స్‌ అమలుకు సంబంధించిన ఫైళ్లపై తొలి సంతకాలు చేస్తామని ప్రకటించారు. అనుకున్నట్టుగానే ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు అయింది. బుధవారం సీఎంగా చంద్రబాబుతోపాటు మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. అయితే, ఈ క్రమంలో చంద్రబాబు తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై పెడతామని ప్రకటించారు. కానీ, ప్రమాణ స్వీకారం చేసిన రోజు సంతకం చేయకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు తన తొలి సంతకాన్ని గురువారం చేయనున్నట్టు తెలిసింది. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్న చంద్రబాబు అనంతరం సచివాలయానికి చేరుకుని సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలో మొదటి బ్లాక్‌లోని చాంబర్‌లో చంద్రబాబు బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ విడుదలకు సంబంధించి తొలి సంతకాన్ని చేయనున్నట్టు తెలిసింది. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దుపై రెండు, పింఛన్‌ నాలుగు వేలకు పెంచుతూ మూడు, అన్న క్యాంటిన్లను పునరుద్ధరిస్తూ నాలుగు, స్కిల్‌ సైన్సెస్‌పై ఐదో సంతకం చంద్రబాబు చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్