ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వెళ్లిన ఆయన గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చంద్రబాబు నాయుడు ప్రధానితో చర్చించారు.
ప్రధానితో సమావేశమైన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వెళ్లిన ఆయన గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చంద్రబాబు నాయుడు ప్రధానితో చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రానికి ఆర్థిక సాయం ఇతర అంశాలపై సుమారు అరగంటపాటు ప్రధానితో చంద్రబాబు చర్చించారు. అంతకముందు రాష్ట్రానికి చెందిన ఎన్డీఏ ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. ఆయనతో వివిధ అంశాలపై చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా చర్చించారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ చౌహాన్ తో సీఎం భేటీ కానున్నారు. సాయంత్రం కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, హర్దీప్ సింగ్ పూరితో చంద్రబాబు సమావేశం అవుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులు అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు స్వాగతం పలికారు.
రాష్ట్రానికి కావలసిన విధులపై చర్చ..
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన కూటమిగా పోటీ చేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. గడిచిన ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలను కూటమి నేతలు ఇచ్చారు. ఈ హామీలు అమకుకు పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతుంది. అందుకు అనుగుణంగా నిధులను సమీకరించే దిశగా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే ప్రధానితో సమావేశమైన చంద్రబాబునాయుడు నిధులను మంజూరు చేయాల్సిందిగా కోరారు. ఇతర శాఖల నుంచి రాష్ట్రానికి కావలసిన నిధులతోపాటు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను కూడా చంద్రబాబు నాయుడు ఈ భేటీలో చర్చిస్తున్నారు.