రాష్ట్రంలో టీడీపీ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందంటూ వైసీపీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. జగన్‌కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి రాష్ట్రంలో హత్యకు గురైన 36 మంది పేర్లు చెప్పాలని చంద్రబాబు సవాల్ విసిరారు. ఢిల్లీ వేదిక ధర్నా చేసిన జగన్.. హత్యకు గురైన వారి పేర్లను ఎక్కడా ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే పనులు మానుకోవాలని హితవు పలికారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో టీడీపీ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందంటూ వైసీపీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. జగన్‌కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి రాష్ట్రంలో హత్యకు గురైన 36 మంది పేర్లు చెప్పాలని చంద్రబాబు సవాల్ విసిరారు. ఢిల్లీ వేదిక ధర్నా చేసిన జగన్.. హత్యకు గురైన వారి పేర్లను ఎక్కడా ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే పనులు మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై జగన్ పచ్చి అబ్ధాలు మాట్లాడుతున్నారన్న చంద్రబాబు.. అసెంబ్లీకి వచ్చి శ్వేతపత్రాలపై సమాధానం చెప్పాలన్నారు. అసత్యాలు చెబుతూ ప్రజలను ఇంకా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని ఎవ్వరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న చంద్రబాబు.. ప్రతి ఒక్కరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
అప్పులు కుప్పగా మార్చారు
రాష్ట్రాన్ని గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ అప్పులు కుప్పగా మార్చిందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ పాలనలో రూ.9.74 లక్షల కోట్లకుపైగా రుణ భారం పెరిగిందన్నారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారని విమర్శించిన చంద్రబాబు.. స్థానిక సంస్థల నిధులను దారి మళ్లించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత పాకుల అసమర్థ నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గిందని వెల్లడించారు. గత ప్రభుత్వంలో జరిగిన అడ్డగోలు నిర్ణయాలు, అవినీతి వ్యవహారాలపై విచారణ జరిపిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అనేక రంగాల్లో వైసీపీ నాయకులు దోచుకున్నారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తుంటే.. వాటిపై కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.