రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు బ్రాండ్ ఒకటే మార్గం : ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు బ్రాండ్ చంద్రబాబు ఒక్కటే మార్గమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ఆ బ్రాండ్ తోనే టీమ్ చంద్రబాబు.. శక్తికి మించి పనిచేసి రాష్ట్ర ఆర్థిక రంగాన్ని, రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందని స్పష్టం చేశారు. గడిచిన ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అతలాకుతలం చేశారని, దీనివల్ల రాబడులు రాకుండా సంక్షోభం ఏర్పడిందని స్పష్టం చేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని సరిదిద్దే పనిలో పడ్డామని, అప్పులు చేస్తూనే సొంత కాళ్లపై రాష్ట్రం నిలబడేలా చేయడమే లక్ష్యమని పయ్యావుల కేశవ్ వెల్లడించారు.

Finance Minister Payyavula Keshav

ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు బ్రాండ్ చంద్రబాబు ఒక్కటే మార్గమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ఆ బ్రాండ్ తోనే టీమ్ చంద్రబాబు.. శక్తికి మించి పనిచేసి రాష్ట్ర ఆర్థిక రంగాన్ని, రాష్ట్రాన్ని గాడిలో  పెడుతుందని స్పష్టం చేశారు. గడిచిన ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అతలాకుతలం చేశారని, దీనివల్ల రాబడులు రాకుండా సంక్షోభం ఏర్పడిందని స్పష్టం చేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని సరిదిద్దే పనిలో పడ్డామని, అప్పులు చేస్తూనే సొంత కాళ్లపై రాష్ట్రం నిలబడేలా చేయడమే లక్ష్యమని పయ్యావుల కేశవ్ వెల్లడించారు. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.205 కోట్లు విడుదల చేస్తూ మొదటి సంతకం చేసిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రంలో ద్విచక్ర వాహనాలకు కొనుగోలు తగ్గిపోయాయని, లారీలు ఏపీలో తిరుగుతుంటే, కొనుగోళ్ళు మాత్రం నాగాలాండ్ లో ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇక్కడ పన్నులు భారం ఎక్కువగా ఉండడం వల్లే అక్కడ కోనుగోలు చేస్తున్నారని స్పష్టం చేశారు. కర్ణాటకలో లారీలకు డీజిల్ పోయిస్తారని, కానీ ఆ వాహనాలు మన రాష్ట్రంలో తిరుగుతాయన్నారు. మళ్ళీ పక్క రాష్ట్రంలోకి వెళ్లిన తరువాత డీజిల్ పోయించుకుంటారన్నారు. ఇక్కడ ధరలు అధికంగా ఉండడం వల్లే రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయిందని, దీనివల్ల రాష్ట్రం నష్టపోతోందన్నారు. ఆఖరికి ఏపీఎస్ఆర్టీసీకి కూడా కర్ణాటక నుంచే డీజిల్ సరఫరా చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

జగన్ ప్రభుత్వంలో విప్ డీజిల్ సరఫరా చేశారని, పన్నులు పెరిగిపోవడం వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నష్టపోయాయని స్పష్టం చేశారు. వీటి నుంచి కోలుకునేలా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో న్యాచురల్ గ్యాస్ వినియోగంపై 26 శాతం పన్ను ఉందని, దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో లేదన్నారు. దీనిని తగ్గిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. జగన్ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఎంతగా బ్రష్టు పట్టిందో స్వేతపత్రంలో వివరంగా వెల్లడిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అవసరమైన అన్ని ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి అవరోధంగా మారాయని, వీటిని పరిష్కరించుకుంటూనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతామన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని, ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకుండానే ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబునాయుడు నేతృత్వంలో అంకితభావంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్