నేడు శ్రీసిటీలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు.. 15 పరిశ్రమలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రూ.1570 కోట్ల పెట్టుబడులతో 8480 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఏర్పాటు అయిన 15 పరిశ్రమలను ఆయన ప్రారంభించనున్నారు. మరో రూ.900 కోట్లు పెట్టుబడులతో 2007 వందల నలభై మందికి ఉద్యోగాలు కల్పించే ఏడు పరిశ్రమలకు భూమి పూజ చేయనున్నారు.

cm nara chandrababu naidu

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రూ.1570 కోట్ల పెట్టుబడులతో 8480 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఏర్పాటు అయిన 15 పరిశ్రమలను ఆయన ప్రారంభించనున్నారు. మరో రూ.900 కోట్లు పెట్టుబడులతో 2007 వందల నలభై మందికి ఉద్యోగాలు కల్పించే ఏడు పరిశ్రమలకు భూమి పూజ చేయనున్నారు. అలాగే రూ.1213 కోట్ల పెట్టుబడితో 4060 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే మరో ఐదు పరిశ్రమల స్థాపనకు సంబంధిత ప్రతినిధులతో ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. అధికారిక సమాచారం మేరకు సోమవారం ఉదయం 10:40 గంటలకు చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరి 11 3 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు అక్కడ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సిటీ అన్నారు శ్రీ సిటీ బిజినెస్ సెంటర్ను సందర్శించి మధ్యాహ్నం రెండు మూడు గంటల వరకు అక్కడే గడపనున్నారు ఈ సందర్భంగా ఎల్జి పాలిమర్స్, నైడెక్, ఈప్యాక్ డ్యూరబుల్స్, నియో లింకు టెలి కమ్యూనికేషన్స్, ఓజీ ఇండియా ప్యాకేజింగ్, జెన్ లైనెన్, జేజీఐ మెటల్ కన్వర్ట్స్, త్రినాధ్ ఇండస్ట్రీస్, ఎవర్ సైన్ మౌల్డర్స్, ఆటో డేటా, ఎస్.కె కాంపోనెంట్స్, అడ్మిర్ కేబుల్స్, బాంబో కోటెడ్ అండ్ స్పెషల్ స్టీల్, శ్రీ లక్ష్మీ ఆగ్రో ఫుడ్స్ తదితర పరిశ్రమతో పాటు శ్రీ సిటీ ఈఎంసి ఫైర్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు.

అలాగే బ్లూ స్టార్, ఎన్జీసి ట్రాన్స్మిషన్, సిద్ధార్థ లాజిస్టిక్స్, టిఐఎల్ హెల్త్ కేర్, ఏజీపి సిటీ గ్యాస్, ఆర్.ఎస్.బి ట్రాన్స్మిషన్, వేర్మైరన్ రీహబ్ తదితర పరిశ్రమలతో పాటు హైటెక్ పోలీస్ స్టేషన్ భావన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం డైకిన్, యాక్సిలెంట్ ఫార్మా, ఆర్మ్వెస్ట్ మీరాయిటిక్ ఇండియా, పిఐ ప్రిస్టేజ్ ఇంటర్నేషనల్ తదితర ఐదు పరిశ్రమల ఏర్పాటుకు ఆయా సంస్థల ప్రతినిధులతో చేసుకోనున్నారు. అనంతరం శ్రీసిటీలోనే వివిధ పరిశ్రమల సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. 2014-19 మధ్యకాలంలో శ్రీసిటీ విస్తరణకు, పెట్టుబడుల ఆకర్షణకు టిడిపి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసింది. 2016లో 4,000 మందికి ఉపాధి లభించేలా రూ.1200 కోట్లతో పరిశ్రమలు ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. 2017లో రూ.600 కోట్లతో పరిశ్రమలు ఏర్పాటుకు 13 కంపెనీలతో 2018లో 14 సంస్థలతో రూ.3500 కోట్లు పెట్టుబడులతో నాలుగు వేల ఉద్యోగాలు లభించేలా ఒప్పందం చేసుకుంది. ఈసారి కూడా అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపిస్తోంది. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి శ్రీ సిటీలో పర్యటిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్