సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పోటీ చేసిన అభ్యర్థులతోపాటు ప్రజల్లోనూ టెన్షన్ నెలకొంది. ఎన్నికల వేడి నుంచి బయటపడేందుకు ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, అగ్రనేతలు విదేశీ పర్యటనలకు వెళ్లారు. విదేశీ పర్యటనల నుంచి తిరిగి వస్తున్న నేతలు మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు
సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పోటీ చేసిన అభ్యర్థులతోపాటు ప్రజల్లోనూ టెన్షన్ నెలకొంది. ఎన్నికల వేడి నుంచి బయటపడేందుకు ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, అగ్రనేతలు విదేశీ పర్యటనలకు వెళ్లారు. విదేశీ పర్యటనల నుంచి తిరిగి వస్తున్న నేతలు మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు బుధవారం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయంగా కీలకమైన సమావేశానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 31న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఎన్నికల ఫలితాలకు ఐదు రోజుల ముందు ఈ సమావేశం ఏర్పాటు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ తో పాటు బిజెపి కీలక నేతలు చంద్రబాబుతో సమావేశం అయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. ఎన్నికల పోలింగ్ తర్వాత వివిధ పార్టీలతో పాటు అనేక సర్వే సంస్థలు ఎలాంటి తీర్పునిచ్చారు అనే దానిపై చర్చించే అవకాశం ఉంది. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని అంశంతోపాటు.. ఫలితాలు ప్రకటించే రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాల పైన చర్చించే అవకాశం ఉంది. కూటమికి మెజారిటీ సీట్లు వస్తే ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని అంశాల పైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలింగ్ అనంతరం జరిగిన గొడవలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన సమాచారాన్ని ఇరు పార్టీల అగ్ర నేతలు తెప్పించుకున్నారు. ఈ సమాచారం పైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. కౌంటింగ్ రోజు గొడవలకు ఆస్కారం లేకుండా పార్టీ కేడర్ కు తెలియజేయవలసిన అంశాల పైన ఈ సమావేశంలో ఇరువు పార్టీల నాయకులు చర్చించే ఛాన్స్ ఉందని ఆ పార్టీల నాయకుడు చెబుతున్నారు.