ఎన్టీఆర్‌కు మించి చంద్రబాబు నటన.. వైసీపీ అధినేత జగన్ సెటైర్లు

దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్‌కు మించి చంద్రబాబు నటిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సెటైర్ వేశారు. రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని చంద్రబాబు అంటే.. ఆ తర్వాత పవన్ కల్యాణ్, పురందేశ్వరి వత్తాసు పలుకుతూ.. గత ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేశారని మండిపడ్డారు.

ntr chandrababu jagan

ఎన్టీఆర్, చంద్రబాబు, జగన్

అమరావతి, ఈవార్తలు : దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్‌కు మించి చంద్రబాబు నటిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సెటైర్ వేశారు. రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని చంద్రబాబు అంటే.. ఆ తర్వాత పవన్ కల్యాణ్, పురందేశ్వరి వత్తాసు పలుకుతూ.. గత ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎగ్గొట్టేందుకు జగన్ అప్పులు చేశాడని.. తన పేరు చెప్పి ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టగా, దానిపై తాడేపల్లిగూడెంలో జగన్ మీడియాతో మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు బడ్జెట్ ఉందని విమర్శించారు. చంద్రబాబు మోసాలు, అబద్ధాలు బయటకు వస్తాయని ఇన్ని రోజులు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సాగదీశారని.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 4 నెలలు మాత్రమే మిగిలి ఉండగా.. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు మాటలన్నీ డ్రామా అని బడ్జెట్‌తో తేలిపోయిందని జగన్ ఎద్దేవా చేశారు. ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్‌లా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఫేక్ ప్రచారం చేసి వైసీపీ ప్రభుత్వం విఫల ప్రభుత్వంగా చూపే ప్రయత్నం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2019లో టీడీపీ ప్రభుత్వం నుండి దిగిపోయే నాటికి రూ.3.13 లక్షల కోట్ల అప్పు ఉండగా, 2024లో తాము దిగిపోయే నాటికి రూ.6.46 లక్షల కోట్ల అప్పు ఉన్నదని వివరించారు. అయితే, రూ.10 లక్షలు కోట్లు.. రూ.14 లక్షల కోట్ల అప్పు అని తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్