పోలవరం విధ్వంసానికి సవాలక్ష కారణాలు.. పీసీసీ చీఫ్‌ షర్మిలా వ్యాఖ్య

రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నారా చంద్రబాబు నాయుడు పోలవరంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పోలవరంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పోలవరాన్ని నావనం చేసిందని, ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమయం పడుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.

PCC chief Sharmila

 కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల


రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నారా చంద్రబాబు నాయుడు పోలవరంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పోలవరంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పోలవరాన్ని నావనం చేసిందని, ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమయం పడుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. మహాభారతంలో కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టుగానే ఏపీలో పోలవరం ప్రాజెక్ట్‌ విధ్వంసానికి అసలు కారకులు టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీలే అని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్మించి 28 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ఆశయం అన్నారన్నారు. కానీ, ఆ తరువాత ప్రభుత్వాలు పంతాలు, పట్టింపులకు పోయి ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌పై ఇన్నాళ్లు రాజకీయ దాడి జరిగిందన్నారు. 

ఏపీ విభజన సమయంలో పోలవరానికి కాంగ్రెస్‌ పార్టీ జాతీయ హోదా హామీ ఇవ్వగా, తరువాత వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం పదేళ్లు ప్రాజెక్టుపై సవతి తల్లి ప్రేమ చూపించిందంటూ షర్మిల మండిపడ్డారు. ఒకవైపు టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లు, తరువాత జగన్‌ ప్రభుత్వం మరో ఐదేళ్లు ప్రాజెక్టును నిర్మించలేదని, పైగా కేంద్రంపై పోరాటం కూడా చేయలేదని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఏపీ ప్రజల కోసం ఏనాడూ ఆలోచించలేదన్నారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును తానే కడతానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రతి సోమవారం పోలవరం అంటూ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో ఆయన చేసింది శూన్యమన్నారు. ఇప్పటికైనా పోలవరం పూర్తి చేయడంపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. 





సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్