నీ ఇలాకా కూడా బీజేపీదే.. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్

బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టనీయనన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.

bandi sanjay kumar

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టనీయనన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన బండి.. ‘ నీ సొంత జిల్లా మహబూబ్‌నగర్ ఎంపీ బీజేపీ.. నీ సిట్టింగ్ సీటు మల్కాజిగిరి ఎంపీ బీజేపీ.. నీవు కామారెడ్డిలో ఓడిపోయింది బీజేపీపై.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌పై గెలిచింది బీజేపీనే. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేక ఎంఐఎం మద్దతు కోరుతోంది. అలాంటిది.. బీజేపీని కాంగ్రెస్ ఆపుతుందా? రోజురోజుకు మరింత బలం పుంజుకుంటాం. మేం ఇక్కడ నాయకత్వాన్ని దక్కించుకొంటాం’ అని పేర్కొన్నారు.

అటు.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ ఆల్రెడీ అడుగు పెట్టింది.. ఇంకా రేవంత్ రెడ్డి అడుగుపెట్టనిచ్చేది ఏంటి? అని విమర్శించారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఎంపీ సీటును బీజేపీ గెలిచింది. రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు మల్కాజ్‌గిరిలో బీజేపీ గెలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరించిన చేవెళ్లలోనూ బీజేపీనే గెలిచింది. రేవంత్ రెడ్డి పోటీ చేసిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ బీజేపీ గెలిచిందని రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డే చివరి సీఎం అని హాట్ కామెంట్స్ చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్