రాష్ట్రంలో 100 రోజుల్లో గంజాయిని అరికట్టాలి : మంత్రి నారా లోకేష్

గంజాయి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 100 రోజుల్లో రాష్ట్రంలో గంజాయి లేకుండా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. మంగళగిరిలో ఈద్గాలో బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. గంజాయిపై తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు హోమ్ మంత్రిని, పార్టీ అధ్యక్షుడిని, పోలీసు ఉన్నతాధికారులు కలిసి విషయాన్ని వివరించానన్నారు.

 Minister Nara Lokesh

మంత్రి నారా లోకేష్


గంజాయి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 100 రోజుల్లో రాష్ట్రంలో గంజాయి లేకుండా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. మంగళగిరిలో ఈద్గాలో బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. గంజాయిపై తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు హోమ్ మంత్రిని, పార్టీ అధ్యక్షుడిని, పోలీసు ఉన్నతాధికారులు కలిసి విషయాన్ని వివరించానన్నారు. తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రతి హామీను అమలు చేసేందుకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలే టిడిపి నేతలపై దాడులకు పాల్పడుతూ హత్యలు చేస్తున్నారని విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో చిలువూరులో మైనారిటీ సోదరుడిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపింది నిజం కాదా..? అని లోకేష్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాంతియుతంగా, ఓర్పుగా ఉండమన్నారనే విషయం గుర్తుంచుకొని దాడులకు దిగడం లేదన్నారు. వైసీపీ నాయకులే దాడులకు పాల్పడుతూ తిరిగి తమపై ఎలా ఆరోపణలు చేస్తారంటూ లోకేష్ ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలనే శాంతియుతంగా ఉన్నామని స్పష్టం చేశారు. గెలిచి పది రోజులు మాత్రమే అయిందని, పదేళ్లలో ఎమ్మెల్యే ఏమి చేశారో చెప్పగలరా..? అని ప్రశ్నించారు. విశాఖలో రుషికొండ వ్యవహారంపై ముఖ్యమంత్రికు అధికారులను నివేదిక సమర్పించామని కోరామన్నారు. రుషికొండ లాంటి ఘటనలు రాష్ట్రంలో చాలా జరిగాయని, వాటన్నింటిపైన నివేదిక వచ్చిన అనంతరం ప్రజల ముందు బహిర్గతం చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఐదు కీలక హామీల అమలుకు సంబంధించి సంతకాలు చేశారన్నారు. భవిష్యత్తులోనూ ప్రజలకు సంక్షేమాన్ని అందించడంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేలా ముందుకు సాగుతామన్నారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని అగ్ర పథంలో నడిపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్