రైతు భరోసా దరఖాస్తులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

రైతు భరోసా దరఖాస్తులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధును బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.

ktr

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఈవార్తలు: రైతు భరోసా దరఖాస్తులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధును బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రైతు శాసించాల‌ని కేసీఆర్ అంటే.. రైతులు యాచించాల‌ని రేవంత్ రెడ్డి అంటున్నార‌ని మండిపడ్డారు. శుక్రవారం ఆయన తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం కేసీఆర్ నాయ‌క‌త్వంలో 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజు చేయాల‌ని, వ్యవసాయాన్ని స్థిరీకరించాలని, ఎవ‌రూ ఆలోచించ‌ని విధంగా రైతుబంధు ప‌థ‌కానికి రూపకల్పన చేశారు. రైతుల మీద ప్రేమ ఉండే నాయ‌కుడు కాబ‌ట్టి.. కేసీఆర్ రైతుకు పెట్టుబ‌డి ఇవ్వాల‌ని ఆలోచ‌న చేశారు. దాన్ని అమ‌లు చేశారు. ఒక‌సారి కాదు.. వ‌రుస‌గా 11 సీజన్లకు ద‌ర‌ఖాస్తు, దండం పెట్టే అవసరం లేకుండా నేరుగా వారి ఖాతాల్లో నిధులు జ‌మ‌ చేశారు. రూ.73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. 12వ సీజన్ వేసేందుకు పైస‌లు జ‌మ చేశాం. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఉత్తరం రాసి ఆపింది’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక ఏడాది దాటిపోయినా రైతుబంధు రూపంలో రూపాయి కూడా రైతుల‌కు ఇవ్వలేదు. 12వ‌ సీజ‌న్ కింద రూ.7,500 కోట్లు మేమే వేసేటోళ్లం. మేం దాచిపెట్టిన రూ.7,500 కోట్లను వాళ్లు రైతుల ఖాతాల్లో వేశారు. కొత్తవి ఇవ్వకపోగా, వ‌రంగ‌ల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్ ఇచ్చారు. రైతుల‌ను రాజుల‌ను చేస్తామని రాహుల్ గాంధీతో ఉప‌న్యాసాలు ఇప్పించారు. కౌలు రైతుల‌కు కూడా రైతు భ‌రోసా ఇస్తామ‌న్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణ‌మాఫీ, బోన‌స్ రూ.500, రైతు కూలీల‌కు రూ.12 వేలు అని చెప్పి మోసం చేశారు’ అని ధ్వజమెత్తారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్