తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలంగాణ మొదటి ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ద‌స‌రా పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌నిషి త‌న‌లోని చెడు మీద నిత్యం పోరాటం చేస్తూ మంచి దిశ‌గా విజ‌యం సాధించాల‌నే జీవ‌న తాత్విక‌త‌ను విజ‌య ద‌శ‌మి మ‌న‌కు తెలియ‌జేస్తుంద‌న్నారు.

BRS President KCR Dasara festival greetings

తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలంగాణ మొదటి ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ద‌స‌రా పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌నిషి త‌న‌లోని చెడు మీద నిత్యం పోరాటం చేస్తూ మంచి దిశ‌గా విజ‌యం సాధించాల‌నే జీవ‌న తాత్విక‌త‌ను విజ‌య ద‌శ‌మి మ‌న‌కు తెలియ‌జేస్తుంద‌న్నారు. ద‌స‌రా రోజు శుభ‌సూచ‌కంగా పాల‌పిట్ట‌ను ద‌ర్శించి.. ష‌మీ వృక్షానికి పూజ చేస్తామన్నారు.అంతేకాదు జ‌మ్మి ఆకును బంగారంలా భావించి పెద్ద‌ల‌కు స‌మ‌ర్పించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవ‌డం ఆచారమన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల్లో ద‌స‌రా పండుగ‌కు ప్ర‌త్యేక స్థానం ఉందన్నారు. అలాయ్ బ‌లాయ్ తీసుకుని ప‌ర‌స్ప‌ర ప్రేమాభిమానాల‌ను పంచుకోవ‌డం ద్వారా ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల మధ్య  సామాజిక సామ‌ర‌స్యం ఫ‌రిడ‌విల్లుతుందని తెలిపారు కేసీఆర్.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్