||బండి సంజయ్||
ఢిల్లీ లిక్కర్ స్కాంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ప్రధాన కార్యాలయం కు వెళ్లకుండా ఈడీకి షాక్ ఇచ్చింది. అనారోగ్యంతో బాధపడుతుందని కవిత తరపు న్యాయవాది సోమ భరత్ ఈడీకి సమాచారం అందించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కవిత అరెస్టు కావడం ఖాయం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఢిల్లీలో కవిత అరెస్టు కోసం పెద్ద ఎత్తున రంగం సిద్ధం చేస్తున్నారని ఏ సమయంలోనైనా ఆమెను అరెస్ట్ చేస్తారని ఇందులో ఎలాంటి సందేహం లేదంటూ బండి సంజయ్ పేర్కొంటున్నారు. నిన్న జరిగిన TSPSC కార్యాలయం వద్ద బీజేపీ పార్టీ సభ్యులను చంచల్ గూడ జైలుకు పంపినందుకు ఇలాంటి భయం లేదు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ బీజేపీ పార్టీని భయపెట్టాలని చూస్తున్నాడు. కానీ మేం భయపడే వాళ్ళం కాదు.. న్యాయం కోసం పోరాడే వాళ్ళం మాకు జైలుకు వెళ్లడం సర్వసాధారణమైపోయింది అంటూ.. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జైలు రూములు రెడీ చేయండి. "ఆడ కూడా నీ బిడ్డకు రెడీ అవుతుంది కదా" అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కవిత లిక్కర్ స్కాం కేసులో బండి సంజయ్ కామెంట్స్ హైలెట్ అవుతున్నాయి. బీజేపీ నేత విజయశాంతి కూడా కవిత పై మండిపడుతోంది. మహిళ అని అడ్డుపెట్టుకొని విచారణకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం మొత్తం క్రిమినల్ మైండ్ అని విచారణకు వెళ్లకుండా ఎత్తులు ఎలా వేయాలో తమకు తెలుసాని సాకులు చెబుతూ ఉంటారని ఆరోపించారు.