రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు, ఫిరాయింపులు వ్యవహారంపై బీఆర్‌ఎస్ గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. కేటీఆర్, బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. తెలంగాణలో రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఈ మేరకు గవర్నర్ రాధాకృష్ణన్‌కు ఫిర్యాదును సమర్పించారు.
గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తున్న కేటీఆర్ సహా ఇతర నేతలు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు, ఫిరాయింపులు వ్యవహారంపై బీఆర్‌ఎస్ గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. కేటీఆర్, బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. తెలంగాణలో రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఈ మేరకు గవర్నర్ రాధాకృష్ణన్‌కు ఫిర్యాదును సమర్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ దారుణాలకు పాల్పడుతోందన్నారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్లు లాభం వస్తుందని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పరీక్షలను నాలుగు నెలలు వాయిదా వేశారంటూ ప్రశ్నించారు. నాలుగు నెలలకు రూ.400 కోట్లు వస్తాయా..? అందులో రేవంత్ రెడ్డి వాటా ఎంత అని ప్రశ్నించారు.
అదే సమయంలో రాష్ట్రంలో భయానక పరిస్థితులను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడులు, నిర్బంధం, అణిచివేత, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. రాజ్యాంగాన్ని రక్షిస్తున్న రాహుల్ గాంధీ పోజులు కొడుతూ, మరో వైపు వేరే పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటురంటూ కేటీఆర్ మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను గవర్నర్‌తోపాటు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసేందుకు బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగపాలు చేశారని, మేడిగడ్డ కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు సిగ్గుతో తల దించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. త్వరలోనే మేడిగడ్డను సందర్శించి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని పేర్కొన్నారు.