బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మాతో టచ్‌లో ఉన్నారు.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. జార్ఖండ్ ఎన్నికలు ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న ఆయన.. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.

bhatti

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఈవార్తలు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. జార్ఖండ్ ఎన్నికలు ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న ఆయన.. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, దేశవ్యాప్తంగా బీజేపీ పతనం ప్రారంభమైందని అన్నారు. ఈ మధ్య కాలంలో నిర్వహించిన అన్ని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్సే గెలిచిందని తెలిపారు. ప్రజల్లో కాంగ్రెస్, రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగిందని వ్యాఖ్యానించారు.

‘బీఆర్ఎస్ కాజేసిన భూములను వెలికి తీస్తాం. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని కాజేసిన ఆ భూములను తిరిగి తీసుకుంటాం. రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మంత్రి వర్గ విస్తరణపై మా పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. ప్రతిపక్షాలవి పసలేని విమర్శలు. వాటితో ఎలాంటి ప్రయోజనం ఉండదు. హైడ్రా, మూసీ విషయంలో అన్నీ ఆలోచించే ముందుకు వెళ్తున్నాం. మూసీ నిర్వాసితులు వ్యాపారాలు చేసుకునేందుకు రుణ సదుపాయం కూడా కల్పిస్తాం’ అని పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్