||సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫాం అందుకుంటున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి Photo: File||
(ఎల్బీనగర్, ఈవార్తలు, దేవులపల్లి రంగారావు)
అభివృద్ధి సంక్షేమం కావాలి అంటే మరోసారి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని భారత రాష్ట్ర సమితి మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆర్కే పురం డివిజన్ పరిధిలోని హరి పూరి కాలనీలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పెండ్యాల నగేష్ శ్రీనివాస్ ముదిరాజ్ రామాచారి సాజిద్ శ్రీనివాసరెడ్డి లింగస్వామి కొండ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి పెంబర్తి శ్రీనివాసరావు దుబ్బాక శేఖర్ కంచర్ల శేఖర్ వాసీదు పటేల్ బాలు శ్రీ ఇస్మాయిల్ అల్లావుద్దీన్ పటేల్ పాషా సునీత పటేల్ ప్రేమలత సుజాత తదితరులు పాల్గొన్నారు.