వరంగల్‌లో బహిరంగ సభ ఏర్పాటుకు భారీ ఎత్తున కార్యాచరణ రూపొందుతోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్ని జిల్లాల నేతలతో సమావేశం అవుతూ, చేపట్టాల్సిన కార్యాచరణను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా రజతోత్సవ సభ కోసం హమాలీలు తమ వంతు సహకారం అందించారు.
హైదరాబాద్, ఈవార్తలు: తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పుట్టిన పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం సాక్షిగా పుట్టిన ఆ పార్టీ.. ఎన్నో పోరాటాలు చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం తలొగ్గిన కేంద్ర నాయకత్వం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ పార్టీ పదేళ్లు అధికారంలో అప్రతిహత విజయాలు సాధించింది. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టింది. అయితే, 2025 ఏప్రిల్ 27తో ఆ పార్టీ ఆవిర్భవించి.. 25 వసంతాలు పూర్తి కానున్నాయి. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా పరివర్తనం చెందిన ఆ పార్టీ.. ఈ ఏడాది రజతోత్సవాన్ని జరుపుకుంటోంది.
ఈ నేపథ్యంలో వరంగల్‌లో బహిరంగ సభ ఏర్పాటుకు భారీ ఎత్తున కార్యాచరణ రూపొందుతోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్ని జిల్లాల నేతలతో సమావేశం అవుతూ, చేపట్టాల్సిన కార్యాచరణను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా రజతోత్సవ సభ కోసం హమాలీలు తమ వంతు సహకారం అందించారు. ఈ నెల 27న జరిగే ఈ సభకు ఖర్చుల నిమిత్తం ఈ డబ్బును అందజేస్తున్నట్లు హమాలీ సంఘం నేతలు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి.. రూ.1,14,000 చెక్కును అందజేశారు. ఇందుకుగానూ కేటీఆర్ వారికి ధన్యవాదాలు తెలిపారు. వారితో ప్రత్యేకంగా ఫొటో దిగారు. పార్టీకి అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ నెల 27న జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి ఖర్చుల నిమిత్తం.. లక్షా 14 వేల రూపాయల చెక్కును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అందచేసిన హమాలీ సంఘం.#25YearsOfBRSpic.twitter.com/baBAilQpnk
— KTR News (@KTR_News) April 7, 2025