దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం కేసీఆర్ కీలక నిర్ణయం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ Photo: Twitter ||

దేశ రాజకీయాల కోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి వివిధ రకాలుగా వ్యూహాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ బలంగా రూపొందేలా పాటల రూపంలో పార్టీ ఉద్దేశాన్ని తెలియజేయడానికి వివిధ రకాల భాషలో పాట రూపకల్పన చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే హిందీ, మరాఠీ, కన్నడ, ఒరియా భాషల్లో పాటల రూపకల్పన జరుగుతోందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు మొదలయ్యాయి. విజయవాడ మాజీ మేయర్‌ తాడి శకుంతల, మహిళా ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వేఘవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి మాల్యాద్రితోపాటు పలువురు మైనారిటీ నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరిని స్వాగతిస్తూ తోట చంద్రశేఖర్‌ గులాబీ కండువాలతో పార్టీ కి స్వాగతం తెలిపారు. తెలంగాణను  తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి దేశ అభివృద్ది  కూడా మార్చే సామర్ద్యం ఉందంటూ పార్టీలోని అభ్యర్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరుతో న్యూస్ పేపర్ ప్రారంభించనున్నట్లు సమాచారం తెలుస్తుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్