||ప్రచారంలో పాల్గొన్న సంరెడ్డి వెంకట్ రెడ్డి||
రాష్ట్రంలో మరొకసారి అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని సర్వేలు తేల్చి చెబుతున్నాయని, మళ్లీ కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అల్మాస్‌గూడ మాజీ ఎంపీటీసీ సంరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి మళ్లీ తన విజయఢంకా మోగిస్తారని చెప్పారు. అల్మాస్గూడ, బీఆర్ఆర్ కాలనీ, విశాఖనగర్ కాలనీల్లో సబితకు భారీ మెజార్టీ కోసం ప్రచారంలో భాగంగా.. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగున్నదని, ఈ నేపథ్యంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలంతా సన్నద్ధమవుతున్నారని తెలిపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి వల్లే మహేశ్వరం అభివృద్ధిలో దూసుకుపోతుందని, మళ్లీ ఆమెకే పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఆర్ కాలనీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, విశాఖనగర్ కాలనీ అధ్యక్షులు సుభాశ్, ఆయా కాలనీల సభ్యులు సుధాకర్‌రావు, సూర్యప్రకాశ్, జగదీశ్వర్‌రావు, వెంకటేశ్, ఆనందరెడ్డి, సురేందర్రెడ్డి, మహేశ్ నాయక్, లక్ష్మణరావు, బాలరాజు, శ్రీరామ్ రెడ్డి, తిరుపతిరావు, కరుణాకర్‌గౌడ్, జగదీశ్ నాయక్, శ్రీనివాస్ నాయక్, నగేశ్ చారి, అర్జున్ రావు, తులసీరామ్, కార్యకర్తలు సంరెడ్డి సంజీవరెడ్డి, కొండల్ రెడ్డి, డిండి వెంకటేశ్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, రాజు, మధుసూదనరావు, భూపతి, సంపెల్లి రాహుల్, దేవానంద్ పాల్గొన్నారు.