తెలంగాణలో 8 నియోజకవర్గాల్లో బ్రాహ్మణ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||తెలంగాణలో 8 నియోజకవర్గాల్లో బ్రాహ్మణ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీ||

(రంగారెడ్డి, ఈవార్తలు, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

రానున్న ఎన్నికల్లో బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా 8 నియోజకవర్గాలలో బ్రాహ్మణ సభ్యులు పోటీ చేస్తున్నట్లు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ప్రధాన కార్యదర్శి అచ్యుతరామ శర్మ తెలిపారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్యవర్గ సమావేశం హైదరాబాదు తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని శివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పలువురు బ్రాహ్మణ పెద్దలు పాల్గొని రాబోయే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల గురించి విస్తృతంగా చర్చించామని అన్నారు ఆ తరువాత జరిగిన కార్యవర్గ సమావేశంలో కార్యవర్గ సభ్యులు ప్రసంగించారు. ఆర్గనైజింగ్ కార్యదర్శి చోడవరపు శ్రీనివాసరావు ప్రారంభంలో సభ్యుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధాన కార్యదర్శి అచ్యుతరామ శర్మ ప్రసంగిస్తూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా 8 నియోజకవర్గాలలో బ్రాహ్మణ సభ్యులు పోటీ చేస్తున్నట్లు సభికుల హర్షద్వానాల మధ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినూత్న పద్ధతిలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న బ్రాహ్మణ సంక్షేమ వేదిక ప్రత్యక్షంగా రాజకీయాలలో పాల్గొని చైతన్యం తేవడానికి నిర్ణయించుకోవడం గొప్ప విషయమని ఎందుకనగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఎనిమిది మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారని సభ్యుల మద్దతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు.

బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాసులు మాట్లాడుతూ బ్రాహ్మణ ఓటు బ్యాంకు కాపాడడానికి బ్రాహ్మణులకు సీటు కేటాయించని రాజకీయ పార్టీలకు ఇది గుణపాఠం చెప్పడానికి ఎనిమిది మంది సభ్యులకు మద్దతు తెలియజేస్తున్నామని వివరించారు. మల్కాజిగిరి నుండి నేరెళ్ల మల్లికార్జునరావు ఖైరతాబాద్ నుండి పావని శర్మ మేడ్చల్ నుండి సత్యనారాయణ కుకట్పల్లి నుండి అచ్యుత రామ శర్మ వరంగల్ నుండి పెండెం రాఘవరావు పాలేరు నుండి శ్రీనివాసరావు ఖమ్మం నుండి వెంకటరమణ పోటీలో ఉన్నట్లు బాల శ్రీనివాస్ తెలిపారు. ఇంకా మరికొన్ని నియోజకవర్గాలలో బ్రాహ్మణ అభ్యర్థులకు మద్దతు తెలియజేస్తామని వారు వివరించారు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఉపాధ్యక్షురాలు పావని శర్మ మాట్లాడుతూ రాజకీయంగా బ్రాహ్మణులను ఎదగకుండా చేస్తున్న పార్టీలకు తగిన గుణపాఠం ఈ ఎన్నికల్లో చెబుతామని హెచ్చరించారు. వరంగల్ అభ్యర్థి రాఘవరావు మాట్లాడుతూ వరంగల్ లో పోటీ చేయడానికి గత సంవత్సర కాలంగా కృషి చేస్తున్నట్లు అనేకమంది బ్రాహ్మణులను ఇప్పటికే కలిసి ఓటు వేయమని అభ్యర్థించినట్లు తెలిపారు.

పాలేరు అభ్యర్థి శ్రీనివాసరావు మాట్లాడుతూ తాము ఎన్నికల్లో పోటీ చేయడానికి తగిన ప్రోత్సాహాన్ని కల్పించిన బ్రాహ్మణ సంక్షేమ వేదికకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అదే విధంగా అన్ని సంఘాలు కలిసికట్టుగా తమకు మద్దతు తెలియజేస్తే తాము సులభంగా గెలిచే అవకాశాలు ఉంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు జాయింట్ సెక్రటరీ నేరెళ్ల మల్లికార్జునరావు మాట్లాడుతూ బ్రాహ్మణుల ఓటు కోసం సోషల్ మీడియాను వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయడమే కాకుండా బ్రాహ్మణులు ఎక్కడ ఉన్న ఇంటింటికి వెళ్లి ఓట్ల కోసంఅభ్యర్థిస్తున్నట్లు వివరించారు ఎట్టి పరిస్థితిలోనూ బ్రాహ్మణ ఓట్లు బ్రాహ్మణ అభ్యర్థులకు వచ్చే విధంగా ఈ నెల రోజులు తీవ్రంగా కృషి చేయనున్నట్లు తెలిపారు ఇంకా సభలో రాఘవ శేఖర్ రమణ ఉజ్వల శారద సురేష్ రాజేశ్వరరావు రామకృష్ణ వెంకటరమణ ఆంజనేయ శర్మ ప్రసాద్ ఫణి భూషణ్ పద్మ కిషోర్ రత్నం విట్టల్ వి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్