హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు అసంబద్ధం: బ్రాహ్మణ ఐక్య వేదిక

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా హైదరాబాదు పార్లమెంటు అభ్యర్థి కొంపల్లి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలపై మహేశ్వరం బ్రాహ్మణ ఐక్యవేదిక మండిపడింది. ఆమెపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది.

bjp madhavilatha
మహేశ్వరం బ్రాహ్మణ ఐక్యవేదిక సభ్యులు

(రంగారెడ్డి ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా హైదరాబాదు పార్లమెంటు అభ్యర్థి కొంపల్లి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలపై మహేశ్వరం బ్రాహ్మణ ఐక్యవేదిక మండిపడింది. ఆమెపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట పోలీస్ స్టేషన్ లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు బ్రాహ్మణ ఐక్యవేదిక ఫిర్యాదు చేసింది. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను బ్రాహ్మణ ఐక్యవేదిక సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక ప్రతినిధులు మంగు రాఘవరావు, ప్రమోద్ కొటార్, చక్రవర్తుల భువనచంద్ర, యాదగిరిరావు, నవీన్ కుమార్, వంశీకృష్ణ శాస్త్రి, గంప మాధవరావు, శివరామకృష్ణ, ఉమాశంకర్, రవికుమార్, శ్రీకర్ పాల్గొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్