||రామిడి శూరకర్ణ రెడ్డి||
(ఈవార్తలు, రంగారెడ్డి ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరంలో బీజేపీ జెండా ఎరగటం ఖాయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామిడి శూరకర్ణ రెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తమ పార్టీ ప్రచారం చాప కింద నీరులో సాగుతోందని చెప్పారు. ఈమేరకు సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో అధికార బీఆర్ఎస్ పార్టీని దుయ్యబట్టారు. ఆ పార్టీ పాలనలో చెరువులు, పార్కులు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. మహేశ్వరం గడ్డమీద పోటీ చేయడానికి వచ్చే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల చేవెళ్ల వలస పక్షులను చేరదీయవద్దని అన్నారు. అల్మాస్‌గూడ పరిధిలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు, ఎఫ్.టి.ఎల్ స్థలాలను కబ్జా చేసి, ఓట్లు అడిగేందుకు వచ్చే వారికి బుద్ధి ఉండాలని తీవ్రంగా విమర్శించారు.
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్‌గూడ ప్రాంతంలో మంత్రి అనుచరులు చెరువులు కబ్జా చేసిన విషయం, పార్కులు కబ్జా చేసిన విషయం, అనేక ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసిన విషయాలను ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. ప్రజలు వలస పక్షులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను తరిమికొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారని వెల్లడించారు. బీజేపీ అభ్యర్థి అందెల రాములు యాదవ్‌కు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు.
సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్