హర్యానాలో బీజేపీ మూడోసారి గెలుపు.. రాహుల్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

హర్యానా, జమ్ము కశ్మీర్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ రెండు చోట్ల కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ గట్టిగా చెప్పాయి. కానీ, అనూహ్యంగా హర్యానాలో భారతీయ జనతా పార్టీ మూడోసారి విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. ఈ ఫలితాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలకక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను నమ్మలేదంటూ వ్యాఖ్యానించారు.

BRS Working President KTR

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హర్యానా, జమ్ము కశ్మీర్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ రెండు చోట్ల కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ గట్టిగా చెప్పాయి. కానీ, అనూహ్యంగా హర్యానాలో భారతీయ జనతా పార్టీ మూడోసారి విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. ఈ ఫలితాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలకక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను నమ్మలేదంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ చేసిన మోసాన్ని గుర్తించడం వల్లే హర్యానాలో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపాలైందంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో హోరాహోరీ ఉన్న రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తోందని, ఆ పార్టీ ఓటమికి రాహుల్‌ గాంధీ బలహీనమైన నాయకత్వమే కారణమని కేటీఆర్‌ ద్వజమెత్తారు. బీజేపీని ఢీకొని నిలువరించే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకే ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే ఇదే విషయం అర్థమవుతుందన్నారు. మహరాష్ట్ర, జార్ఖండ్‌, ఢిల్లీ ఫలితాలు కూడా రెండు జాతీయ పార్టీలకు ఆశాజనకంగా ఉండవని భావిస్తున్నట్టు కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ ఫలితాలను చూస్తుంటే 2029లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలకు సాధారణ మెజార్టీ సాధ్యం కాదన్నది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. బలమైన ప్రాంతీయ పార్టీలే తదుపరి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా ఉంటాయని జోస్యం చెప్పారు. దేశంలో సమాఖ్య స్ఫూర్తిని, సమగ్రతను, సెక్యులరిజాన్ని కాపాడాలని కోరుకునే మేథావులు, ప్రజలు ప్రాంతీయ పార్టీలకు మద్ధతు తెలియజేయాలని ఆయన కోరారు. 

హర్యానాలో కాంగ్రెస్‌ పార్టీ ఓటమితోనైనా రాహుల్‌ గాంధీ బుధ్ది తెచ్చుకోవాలని కేటీఆర్‌ సూచించారు. చెప్పే మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేనప్పుడు ఇలాంటి చెంపపెట్టు లాంటి ఫలితాలు తప్పవన్నారు. బుల్డోజర్‌ రాజ్‌, పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగ పరిరక్షణ పేరుతో రాహుల్‌ గాంధీ చేసిన డ్రామాలకు హర్యానా ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు, తెలంగాణలో ఆరు గ్యారంటీలు అంటూ అడ్డగోలు హామిలిచ్చి ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్‌, ఏడు గ్యారెంటీలు పేరుతో మభ్యపెట్టాలని చూసినప్పటికీ ప్రజలు ఆ పార్టీకి చెంపపెట్టులాంటి తీర్పును ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలు చేస్తున్న ఈ మోసాన్ని మొత్తం గమనిస్తోందని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు. అబద్ధపు హామీలతో అధికారం సాధించి ఆ తరువాత ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి తగిన సమయంలోనే ప్రజలు బుద్ధి చెబతారని, తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని గుర్తు చేశారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్