క్షేత్రస్థాయిలో బలోపేతంపై బిజెపి దృష్టి.. బూత్ కమిటీలు నియామకం

తెలంగాణలో బిజెపి రానున్న ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి సారించింది ఆ పార్టీ నాయకత్వం. అందులో భాగంగానే బూత్ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి అధ్యక్షులు వరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు ఏర్పాటులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ ఆదేశాల మేరకు ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు బూత్ కమిటీల నియామకం పూర్తిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.

Telangana BJP

తెలంగాణ బిజెపి

తెలంగాణలో బిజెపి రానున్న ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి సారించింది ఆ పార్టీ నాయకత్వం. అందులో భాగంగానే బూత్ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి అధ్యక్షులు వరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు ఏర్పాటులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ ఆదేశాల మేరకు ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు బూత్ కమిటీల నియామకం పూర్తిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. నవంబర్ 27న రాష్ట్రస్థాయి కాదేశాల నిర్వహణకు కూడా ఏర్పాటు చేస్తోంది. వచ్చే నెలలో జిల్లా స్థాయిలోనూ కాదేశాలలో ఏర్పాటు చేయనున్నారు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ జాతీయ సంస్థ గత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమించబడ్డారు. రాష్ట్రానికి సంబంధించి ఎండల లక్ష్మీనారాయణను రాష్ట్ర రిటర్నింగ్ అధికారిగా నియమించారు. సంస్థాగత ఎన్నికల ఏర్పాట్లలో ఎండల లక్ష్మీనారాయణ ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 16 నుంచి 30 వరకు బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని బిజెపి భావిస్తోంది. బూత్ కమిటీలు పూర్తయిన తర్వాత ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించనుంది బిజెపి అగ్రనాయకత్వం.

ఈ సమావేశంలో మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలపై దిశా నిర్దేశం చేయనున్నారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నవంబర్ 21న జాతీయస్థాయిలో, 27న రాష్ట్ర స్థాయిలో, డిసెంబర్ 24 జిల్లా స్థాయిలో కార్యశాలలు నిర్వహించనున్నారు. కమిటీలు నిర్మాణం పూర్తయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది. డిసెంబర్ చివర నాటికి అన్ని రాష్ట్రాల అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తవుతుంది. జనవరిలో జాతీయ అధ్యక్షున్ని ఎన్నుకుంటారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఉన్న ఇక్కడ నాయకత్వం ఈ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బూత్ కమిటీల నియామకానికి సంబంధించి బలమైన నాయకత్వం ఉండేలా ఏర్పాటులు చేస్తున్నారు. పార్టీ చేస్తున్న కార్యక్రమాలు పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన అంకితభావంతో పనిచేసే వారికి ఈ బాధ్యతలను అప్పగించాలని అధినాయకత్వం భావిస్తోంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగాలని భావిస్తున్న బిజెపికి ప్రస్తుతం సంస్థగతంగా పార్టీని బలోపేతం చేయడం కత్తి మీద సాము మాదిరిగానే ఉంది. ఈ ప్రక్రియను ఎంపీలు, ఎమ్మెల్యేలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పార్టీ పట్ల ఆకర్షితులైన వారిని చేర్చుకునేందుకు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా క్షేత్రస్థాయిలో బలంగా తయారు కావడంపై ప్రస్తుతం బిజెపి దృష్టి సారించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్