బీజేపీ నేత, నటి మాధవీలత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నిన్న నేను కారులో వెళ్తుంటే మరో కారు తాకుతూ వెళ్లింది. నా వాహనం డ్యామేజీ అయ్యింది. అయినా వాళ్లు ఆపకుండా వెళ్లిపోయారు. పెద్దవాళ్లు నాకు ఏదో చేస్తున్నారు అనిపిస్తోంది’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.
మాధవీలత Photo: File
బీజేపీ నేత, నటి మాధవీలత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నిన్న నేను కారులో వెళ్తుంటే మరో కారు తాకుతూ వెళ్లింది. నా వాహనం డ్యామేజీ అయ్యింది. అయినా వాళ్లు ఆపకుండా వెళ్లిపోయారు. పెద్దవాళ్లు నాకు ఏదో చేస్తున్నారు అనిపిస్తోంది’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో వివాదం నేపథ్యంలో ఆమె ఈ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. అంతేకాకుండా.. ‘ఈ దుర్యోదన, దుష్యాసన దుర్వినీత లోకం అయిన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆడబిడ్డని నోటికొచ్చిన బూతు మాటలు మాట్లాడి తర్వాత క్షమాపణ విసిరేసి బతికేస్తే? చట్టం గట్టిగా పని చేస్తే ఇంకెప్పుడు ఎవరు నాయకులు మాటలు జారరు. నా దేశం అతి పెద్ద రాజ్యాంగం అమలుచేయడంలో చాలా వెనకబాటులో ఉంది. ఎన్నో మహిళా చట్టాలు పుస్తకాలకే పరిమితమయ్యాయి. అవి పెద్దవాళ్ళకి ఒకలా.. పేదవాళ్లకి మరోలా కాకుండా సరిగ్గా పనిచేసేలా చేస్తే మరెప్పుడు ఇంకెవరు నోరు జారరు కదా? ప్రపంచ పెద్ద దేశాల చట్టాలన్నీ ఎత్తుకొచ్చిమరీ రాసుకున్న రాజ్యాంగం పెద్ద దేశాలలో అమలులో ఉంది. మనదేశంలో మాత్రం ఎందుకు లేదు? రాయకీయ నాయకులకి ఒక న్యాయం.. సాధారణ ప్రజలకి మరో న్యాయం ఎందుకు? ఎందుకు భరించాలి? ఎందుకు సహించాలి? ఎందుకు క్షమించాలి?’ అని రాసుకొచ్చారు.
మాధవీలతను ప్రాస్టిట్యూట్ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పరుష పదజాలం వాడారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), తెలుగు ఫిలిం ఛాంబర్‌కు మాధవీలత ఫిర్యాదు చేశారు. తాజాగా సైబరాబాద్ సీపీకి కూడా ఫిర్యాదు చేశారు. జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అసలేం జరిగిందంటే.. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ పార్క్‌లో మహిళల కోసం కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకలకు వెళ్లొద్దని, అక్కడ మహిళలకు రక్షణ ఉండదని మాధవీలత వీడియో సందేశం పంపారు. దీంతో.. మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా మాట జారారు. మాధవీలత ఒక సినిమా యాక్టర్ అని.. యాక్టర్స్ అంతా ప్రాస్టిట్యూట్స్ అని పరుష వ్యాఖ్యలు చేశారు. జేసీ వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీజేపీ నాయకులు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో వెనక్కి తగ్గి.. క్షమాపణలు చెప్పారు. తన వయసు 72 సంవత్సరాలు అని.. ఆవేశంలో అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. అయితే, జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాధవీలత పోరాటం చేస్తున్నారు.