మహారాష్ట్ర ఎన్నికలకు సిద్ధమైన బిజెపి.. పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల

మరో నెల రోజుల్లో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికలకు బిజెపి సన్నద్ధమైంది. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న బిజెపి అందుకు అనుగుణంగానే వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతలను కీలక నేతలకు బిజెపి అగ్ర నాయకులు అప్పగించారు. అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత పలువురు అభ్యర్థులను ఎంపిక చేసిన బిజెపి అగ్రనాయకత్వం ఈ మేరకు తొలి జాబితాను విడుదల చేసింది. బిజెపి విడుదల చేసిన తొలి జాబితాలో 99 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.

Bjp

బిజెపి

మరో నెల రోజుల్లో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికలకు బిజెపి సన్నద్ధమైంది. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న బిజెపి అందుకు అనుగుణంగానే వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతలను కీలక నేతలకు బిజెపి అగ్ర నాయకులు అప్పగించారు. అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత పలువురు అభ్యర్థులను ఎంపిక చేసిన బిజెపి అగ్రనాయకత్వం ఈ మేరకు తొలి జాబితాను విడుదల చేసింది. బిజెపి విడుదల చేసిన తొలి జాబితాలో 99 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఇందులో 71 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉండగా, బిజెపి 151 సీట్లలో పోటీ చేయనుంది. మిగిలిన సీట్లకు బిజెపి మిత్రపక్షాలు శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి వర్గానికి చెందిన అభ్యర్థులు పోటీ చేయనున్నారు. తాజాగా బిజెపి విడుదల చేసిన తొలి జాబితాలో పోటీ చేయనున్న అభ్యర్థులు జాబితాలో పలువురు ప్రముఖులు ఉన్నారు.

వీరిలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, స్పీకర్ రాహుల్ నర్వేకర్ తోపాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. బిజెపి విడుదల చేసిన తొలి జాబితాలో 13 మంది మహిళలు చోటు దక్కించుకున్నారు. షెడ్యూల్ తెగలకు చెందిన వారికి ఆరుగురికి అవకాశం కల్పించింది బిజెపి అగ్రనాయకత్వం. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి నలుగురికి సీట్లను కేటాయించారు. మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బిజెపి, శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి ఒక కూటమిగా మీద ఏర్పడి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీ కలిసి బరిలోకి దిగుతున్నాయి. ఎన్నికలు ఇరు కూటమి నేతలకు కీలకం కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నేతలు బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ విజయం సాధించడం ద్వారా 2029లో దేశంలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించడంపై భరోసాను కల్పించాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీతో పాటు కూటమి పార్టీలో ఉండగా, ఈ రాష్ట్రంలో గెలవడం ద్వారా తమకు ఎదురేలేదన్న విషయాన్ని మరోసారి తేల్చి చెప్పేందుకు బిజెపిని నేతృత్వంలోనే పార్టీలు సిద్ధమవుతున్నాయి. చూడాలి మరి ఇక్కడి ఓటర్లు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వనున్నారో.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్