టీడీపీలో చేరనున్న బీజేపీ మాజీ నేత కన్నా లక్ష్మీనారాయణ..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



|| కన్నా లక్ష్మీనారాయణ||

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు బీజేపీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఈనెల 23న టిడిపిలో చేరనున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల బీజేపీ పార్టీకి గురువారం రాజీనామా చేస్తూ ఆ లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారని తెలిపారు. రాజీనామా ఏపీలోని రాజకీయాల వల్లనే రాజీనామ చేయాల్సి వస్తుందనీ, మోడీపై అభిమానం ఎప్పటికీ ఇలానే ఉంటుందనీ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి అధికారం నిర్దేశిస్తే ఆ విధంగా నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రాక్షస పాలన పై మండిపడ్డారు. ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి ఇప్పుడు సంపాదించుకుంటున్నడని వ్యాఖ్యానించారు. వైసీపీ రాజకీయాలకు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని, ఇలా జరిగితే ప్రజలు తిరగబడే అవకాశం ఉంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలను టార్గెట్ చేస్తూ రాక్షస పాలన చేస్తున్నారు. నవరత్నాల పథకాలతో గెలిచే సత్తా ఉన్నప్పుడు ఇలాంటి దాడులు చేసి బీహార్ కన్నా దారుణమైన ఫ్యాక్షన్ కు వేదికలా చేస్తున్నాడు ముఖ్యమంత్రి అంటూ విమర్శించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్