తెలంగాణలో వాహన చోదకులకు బిగ్ షాక్.. భారీగా పెరగనునన్న ట్రాఫిక్ చలాన్లు

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలకం నిర్ణయం తీసుకోబోతుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు రవాణాశాఖ సిద్ధమవుతోంది. ప్రస్తుతం వాహనదారులకు విధిస్తున్న జరిమానాతో వాహనదారుల్లో పెద్దగా మార్పు రావడం లేదు. ఇష్టానుసారంగా నిబంధనలను అధికమిస్తూ వాహనాలు నడుపుతున్నారు.

Traffic police

ట్రాఫిక్ పోలీసులు

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలకం నిర్ణయం తీసుకోబోతుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు రవాణాశాఖ సిద్ధమవుతోంది. ప్రస్తుతం వాహనదారులకు విధిస్తున్న జరిమానాతో వాహనదారుల్లో పెద్దగా మార్పు రావడం లేదు. ఇష్టానుసారంగా నిబంధనలను అధికమిస్తూ వాహనాలు నడుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా వాహనదారులు అమలు చేయాలంటే జరిమానాలు భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న చలాన్లపై ఐదు నుంచి ఆరు రెట్లు పెంచేలా నిబంధనల్లో పలు మార్పులు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం యోచిస్తోంది.

వాహనదారులకు ముకుతాడు వేసే అవకాశం..

ఇష్టారీతిన వాహనాలు నడిపే వారికి ముకుతాడు వేసేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ లేకుండా పట్టుబడ్డ వారిపై జరిమానాలు భారీగా విధించేలా కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది హెల్మెట్ లేకుండా పట్టుబడ్డ 18,33,761 మందికి జరిమానాలు విధించారు. ప్రస్తుతం నామమాత్రంగా ఉన్న ఈ జరిమానాలను భారీగా పెంచనున్నారు. ఒకసారి జరిమానా పడ్డ వాహనదారుడు రెండోసారి అదే తప్పు చేయడానికి భయపడేలా ఈ జరిమానా మొత్తాన్ని పెంచనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు, శిక్షలు విధించినా కొందరు మందు బాబులు మాత్రం మారడం లేదు. మద్యం తాగి పదేపదే దొరుకుతున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జులై 31వ తేదీ వరకు ఏడు నెలల వ్యవధిలో వెస్ట్‌జోన్ ట్రాఫిక్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్‌నగర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 5,540 మంది పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. ఈ తరహా జరిమానాలను భారీగా పెంచనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏ తప్పుకు ఎంతెంత జరిమానా వేయాలని దానిపై రవాణా శాఖ అధికారులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. అక్టోబర్ నెల నుంచి నూతన నిబంధనలను అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్