మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఎమ్మెల్యేపై నమోదైన హత్యాయత్నం కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కొద్దిరోజులు ఈవీఎం ద్వంసం కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఎమ్మెల్యేపై నమోదైన హత్యాయత్నం కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కొద్దిరోజులు ఈవీఎం ద్వంసం కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, లెక్కింపు వద్దకు వెళ్లవచ్చని, మాచర్లకు మాత్రం వెళ్లవద్దని హైకోర్టు సూచించింది. ఈలోగా హత్యాయత్నాకి ఎమ్మెల్యే పాల్పడ్డారంటూ మరో మూడు కేసులను పోలీసులు నమోదు చేయడంతో దీనిపైనా హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈవీఎం ధ్వంసం కేసులో వర్తించిన షరతులే ఈ మూడు కేసుల్లో కూడా వర్తిస్తాయని చెప్పిన కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్‌లో తనపై దాడికి పిన్నెల్లి రామకృష్ణారెడి ప్రోత్సహించారని టీడీపీ పోలింగ్ ఏజెంట్ కోటీశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతోపాటు మాచర్లలో జరిగిన వేర్వేరు ఘర్షనల్లో కూడా ఆయన్ని మొదటి ముద్దాయిగా చేరుస్తూ కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మాచర్ల అభ్యర్థిగా ఉన్నందున తాను కౌటింగ్ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని, అందుకే బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆ కేసులతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.