అమెరికా అధ్యక్ష రేస్ నుంచి తప్పుకున్న బైడెన్.. రేసులో కమలా హ్యారిస్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెనక్కి తగ్గారు. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. మొన్నటి వరకు తానే బరిలో ఉంటానంటూ స్పష్టం చేసిన ఆయన.. అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దేశ ప్రయోజనాల రీత్యా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ వారాంతంలో జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. నిజానికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నానికి ముందే ఆయన విజయవకాశాలు 60 శాతం ఉండగా.. కాల్పులు ఘటన తరువాత 78 శాతానికి పెరిగిపోయాయి. అప్పటి నుంచి డెమోక్రాట్లు బైడన్ ఉంటే ఓటమి తప్పదని ప్రకటనలు చేస్తూ వచ్చారు.

US President Joe Biden

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెనక్కి తగ్గారు. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. మొన్నటి వరకు తానే బరిలో ఉంటానంటూ స్పష్టం చేసిన ఆయన.. అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దేశ ప్రయోజనాల రీత్యా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ వారాంతంలో జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. నిజానికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నానికి ముందే ఆయన విజయవకాశాలు 60 శాతం ఉండగా.. కాల్పులు ఘటన తరువాత 78 శాతానికి పెరిగిపోయాయి. అప్పటి నుంచి డెమోక్రాట్లు బైడన్ ఉంటే ఓటమి తప్పదని ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ ను ఎదుర్కోవడం బైడన్ వల్ల కాదంటూ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఇతర సీనియర్లు వ్యాఖ్యానించారు. ఇలా డెమోక్రల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో బైడన్ అనూహ్యంగా ఆదివారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. గురువారం రాత్రి తనకు కోవిడ్ 19 సోకిందని ప్రకటించిన బైడెన్ ప్రస్తుతం తన ఇంట్లో స్వీయ క్వారంటైన్ లో ఉన్నారు. అధ్యక్షా రేసు నుంచి తప్పుకోవడంపై ఓ లిఖితపూర్వక ప్రకటన విడుదల చేశారు. 'ప్రియమైన అమెరికన్లకు అమెరికా అధ్యక్షుడిగా సేవ చేయడం నా జీవితంలో గొప్ప గౌరవం. గడిచిన మూడున్నర ఏళ్లలో మనం చాలా అభివృద్ధిని సాధించాం. ఈరోజు అమెరికా ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఉంది. దేశ పునర్నిర్మాణంలో మనం ఎంతో కృషి చేశాం. డ్రగ్స్ ను నిరోధించాం. తుపాకీ సంస్కృతికి చెక్ పెట్టేలా చట్టాన్ని తీసుకువచ్చా. మొట్టమొదటిసారిగా ఆప్రికా మూలాలు ఉన్న అమెరికా మహిళను సుప్రీంకోర్టులో నియమించాం. కోవిడ్ సమయంలో ఆత్మ నిర్భరంతో ముందుకు వెళ్లాం. ఆర్థిక ఒడిదుడుకులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం. పార్టీ నిర్ణయం మేరకు దేశ ప్రయోజనాల కోసం ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్న' అని పేర్కొన్నారు. అదే సమయంలో ఎక్స్ లో ఓ పోస్టును ఆయన పెట్టారు. 'నా ప్రియతమ డెమోక్రాట్లకు నా నామినేషన్ ను ఆమోదించకుండా పరిపాలన పైన దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఉపాధ్యక్షురాలు కమలా హ్యరిష్ ఈ మూడున్నర ఏళ్ల పాలనలో తనకు ఎంతగానో సహకరించారు. నా వారసురాలిగా ఆమెను ఆమోదిస్తున్నాను. ఆమెకి పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తాను. కలిసికట్టుగా ట్రంప్ ని ఓడిద్దాం' అని పిలుపునిచ్చారు. 

రేసులో ముందంజలో ఉన్న కమలా హ్యారీస్.. 

అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నట్టు బైడన్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్థానంలో అధ్యక్ష పదవికి పోటీ పడబోయే అభ్యర్థి ఎవరన్న దానిపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తానని బయటకు చెప్పారు కానీ అది ఆయన అభిప్రాయం మాత్రమే. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే దానిపై డెమోక్రాట్లు అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కమలాహారిస్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే కొందరు బహిరంగ వ్యాఖ్యలు కూడా చేశారు. బైడన్ తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నామంటే కమలా హారిష్ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకున్నట్టు కాదు అన్నది వారి వాదన. సాధారణంగా అధ్యక్ష పదవికి తమ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉండాలో తేల్చుకోవడానికి అమెరికాలోని పార్టీలు ప్రైమరీలు, కాకస్ లు నిర్వహిస్తాయి. ప్రైమరీలు అంటే బ్యాలెట్ ద్వారా జరిపే ఓటింగ్. కాకస్ అంటే చర్చల ద్వారా జరిపే ఓటింగ్. డెమోక్రాట్లలో ఎవరి మద్దతు ఎవరికి ఉందో, ఎవరికి అత్యధికల మద్దతు ఉందో ప్రైమరీలు, కాకస్ ద్వారా తేలిపోతుంది. ఆ తర్వాత జరిగే పార్టీ జాతీయ స్థాయి సదస్సులో ఎక్కువ మంది మద్దతు పొందిన అభ్యర్థి పేరును లాంచనంగా ప్రకటిస్తారు. షెడ్యూల్ ప్రకారం డెమోక్రాట్ల జాతీయ స్థాయి సదస్సు ఆగస్టు 19న జరగనుంది. సమయం ఇంత తక్కువగా ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ప్రైమరీలు నిర్వహించడం సాధ్యం కాదు. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో నిర్వహించి అభ్యర్థిని ప్రకటించే అంశంపై డెమోక్రాట్లు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆకాంక్షిస్తున్న వారిలో మిషిగన్ గవర్నర్ గ్రేచన్ విట్మార్,  కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూషమ్ ఉన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్