Bharat Ratna | భారతరత్న అవార్డు: చరిత్ర, గొప్పతనం, ఆసక్తికరమైన అంశాలు

భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. భారతరత్న అంటే భారతదేశానికి రత్నం అని అర్థం. 1954 నుండి భారతరత్న అవార్డు ఇవ్వడం ప్రారంభమైంది. మొదట ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పబ్లిక్ సర్వీస్ వంటి రంగాల్లో విశేష కృషి చేసినవారికి ఈ అవార్డు ఇచ్చేవారు.

Bharat ratna

ప్రతీకాత్మక చిత్రం 

భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. భారతరత్న అంటే భారతదేశానికి రత్నం అని అర్థం. 1954 నుండి భారతరత్న అవార్డు ఇవ్వడం ప్రారంభమైంది. మొదట ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పబ్లిక్ సర్వీస్ వంటి రంగాల్లో విశేష కృషి చేసినవారికి ఈ అవార్డు ఇచ్చేవారు. 2011లో ప్రభుత్వం ఈ రంగాలకు మాత్రమే కాకుండా ఏ రంగంలోనైనా అత్యుత్తమ కృషి చేసిన వ్యక్తులను గుర్తించి భారతరత్న ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఆధారంగా చేసుకుని మాత్రమే భారతరత్న ప్రకటిస్తారు. భారతరత్నను తొలిసారి మాజీ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ 1954 జనవరి 2న ప్రకటించారు.

1954లో సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ సీవీ రామన్, చక్రవర్తి రాజగోపాలాచారిని మొదటిసారి భారతరత్న వరించింది. ఇప్పటివరకు మొత్తం 53 మందికి పురస్కారం ప్రదానం చేశారు. ఇందులో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ప్రతి సంవత్సరం భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందేనన్న నిబంధన ఏదీ లేదు. ఇది భారతీయులకే ఇవ్వాలన్న నిబంధన కూడా లేదు. మొదటి విదేశీయుడు పాకిస్థాన్‌కు చెందిన అబ్దుల్ గఫర్ ఖాన్ (1987)కు, రెండోది నెల్సన్ మండేలా-దక్షిణాఫ్రికా (1990) ప్రదానం చేశారు.

చనిపోయినవారికి కూడా అవార్డు: 1966 నుంచి మరణానంతరం కూడా భారతరత్న ఇవ్వడం ప్రారంభమైంది. లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం ఈ అవార్డును పొందిన తొలి వ్యక్తి. భారతరత్న పొందిన మొదటి మహిళ: శ్రీమతి ఇంద్రా గాంధీ (1971). భారతరత్న అందుకున్న అతిపిన్న వయస్కుడిగా సచిన్ టెండుల్కర్ (2014) నిలిచారు. ఈ అవార్డు తీసుకున్న తొలి క్రీడాకారుడు కూడా.

భారతరత్న రూపకల్పన: కాంస్యంతో తయారు చేసిన ఈ అవార్డు ముందు వైపు ప్లాటినంతో చెక్కిన సూర్యుడు, భారతరత్న అనే దేవనాగరి లిపి ఉంటుంది.వెనుక వైపు ప్రభుత్వ చిహ్నం, సత్యమేవ జయతే అని ఉంటుంది. అవార్డు గ్రహీత తన పేరుకు ముందు గానీ, వెనకగానీ భారతరత్న అని ఉపయోగించకూడదు. ఒక వేళ అవార్డు గ్రహీత బయోడేటా, లెటర్ హెడ్, విజిటింగ్ కార్డులో ఉపయోగించాలనుకుంటే.. Awarded Bharat Rantna by the President లేదా Recipient of Bharath Rantna Award అని ఉండాలి.  

2024లో ప్రకటించిన భారతరత్న అవార్డులు: ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న ప్రకటించారు.

కర్పూరి ఠాకూర్ (మాజీ ముఖ్యమంత్రి, సోషలిస్ట్ నాయకుడు)

లాల్ కృష్ణ అద్వానీ (మాజీ ఉప ప్రధాని)

పి.వి. నరసింహారావు (భారత 9వ ప్రధాని)

చౌదరి చరణ్ సింగ్ (భారత 5వ ప్రధాని)

ఎం.ఎస్. స్వామినాథన్ (ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త)

భారతరత్న పొందిన వారికి అందే బెనిఫిట్స్:

భారతరత్న అవార్డు గ్రహీతకు ఎలాంటి నగదు బహుమతి అందదు. కానీ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. భారతరత్న అవార్డు గ్రహీతలు ఏ రాష్ట్రానికి వెళ్లినా రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం అందిస్తుంది. రాష్ట్రంలో ప్రయాణ, వసతిని ఏర్పాటు చేస్తుంది. భారతరత్న పొందిన వారికి డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఇస్తారు. జీవితకాలం పెన్షన్ వస్తుంది. అధికారిక ప్రొటోకాల్ లిస్ట్‌లో భారతరత్న అవార్డు గ్రహీతలుగా  7వ స్థానంలో ఉంటారు. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవాలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తారు. వీరు Air india విమానంలో ఉచితంగా ప్రయాణించవచ్చు. భారతరత్న గ్రహీతలు మరణిస్తే సైనికుల గౌరవ వందనంతో ప్రభుత్వమే అధికారిక అంత్యక్రియలు నిర్వహిస్తుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్