భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. హైదరాబాదులోని బిజెపి కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రేవంత్ రెడ్డిపై నమ్మకం పోయిన రోజు నుంచి కాంగ్రెస్తో జరగబోయేది యుద్ధమే అంటూ ఆయన అల్టిమేటం జారీ చేశారు.
కేంద్రమంత్రి బండి సంజయ్
భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. హైదరాబాదులోని బిజెపి కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రేవంత్ రెడ్డిపై నమ్మకం పోయిన రోజు నుంచి కాంగ్రెస్తో జరగబోయేది యుద్ధమే అంటూ ఆయన అల్టిమేటం జారీ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటైన బిజెపి ధాటికి తట్టుకోలేనంతగా యుద్ధం చేస్తామని ప్రకటించారు. బిఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీగా పేర్కొన్న బండి సంజయ్.. ఆ పార్టీతో పొత్తు లేదా విలీనం చర్చలు జరుగుతాయని జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అంటూ కొట్టి పారేశారు. కోర్టు విషయాలను పార్టీలతో ముడి పెట్టడం సమంజసం కాదన్నారు.
బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు తేడా లేకుండా పోయిందని, అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీగా బండి సంజయ్ పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, బిజెపికి మధ్య పోటీ జరగనుందని, పంచాయతీలకు నిధులు ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. ఏ పార్టీ గెలిస్తే పంచాయతీలుకు నిధులు వస్తాయో ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయని, ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలని ఆలోచన బిజెపికి లేదని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు భూముల విషయంలో రాద్ధాంతం చేస్తున్న అసదుద్దీన్ ఒవైసీ.. ఎన్ని వక్ఫ్ బోర్డు భూములను కాపాడారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందుతే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని స్పష్టం చేశారు. హై కమాండ్ ఎవర్ని బిజెపి తెలంగాణ అధ్యక్షుడుగా నియమిస్తే వారి నేతృత్వంలో పనిచేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.