వైసీపీ నేతలపై దాడులు.. మరోసారి ఎక్స్‌లో స్పందించిన వైఎస్‌ జగన్‌

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ అధినేత మరోసారి స్పందించారు. అనేక ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆయన ఎక్స్‌ వేదికగా శుక్రవారం సాయంత్రం స్పందించారు.

YS Jaganmohan Reddy

వైయస్ జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి స్పందించారు. అనేక ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆయన ఎక్స్‌ వేదికగా శుక్రవారం సాయంత్రం స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన జగన్‌.. చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపుతో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు వాటిల్లిందన్నారు. టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తాయన్న జగన్‌.. యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని, పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయిందని ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు.

ఉన్నత చదువులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపైనా దౌర్చన్యాలకు దౌర్జన్యాలకు దిగి వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గడిచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు, ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడు రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి, పౌర స్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోందన్న జగన్‌.. గౌరవ గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు పార్టీ అండగా నిలుస్తుందని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్