అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. దుండగుడు కాల్పులు జరిపి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయం అయింది. కాల్పులు జరిపిన ప్రాంతాన్ని అనుమానిత స్థలంగానే పరిగణిస్తున్నట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటించింది. దుండగుడు కాల్పులు జరిపిన ప్రదేశంలో ఇంకా కొన్ని అనుమానిత ప్యాకేజీలను గుర్తించినట్లు వెల్లడించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి జరిగినట్లు అక్కడ పరిస్థితులు సూచిస్తున్నాయి.
డోనాల్డ్ ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. దుండగుడు కాల్పులు జరిపి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయం అయింది. కాల్పులు జరిపిన ప్రాంతాన్ని అనుమానిత స్థలంగానే పరిగణిస్తున్నట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటించింది. దుండగుడు కాల్పులు జరిపిన ప్రదేశంలో ఇంకా కొన్ని అనుమానిత ప్యాకేజీలను గుర్తించినట్లు వెల్లడించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి జరిగినట్లు అక్కడ పరిస్థితులు సూచిస్తున్నాయి. ముష్కరుడు దాడి చేయడానికి ఇంటిపైకి ఎక్కేందుకు నిచ్చెన ఉంది. ట్రంప్ వచ్చే సమయానికే అతడు పైకప్పు ఎక్కి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు సభా స్థలం వద్ద గన్మెన్ పొజిషన్ తీసుకున్న ప్రదేశం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడికి పాల్పడిన నిందితుడు వయసు సుమారు 20 ఏళ్లు. అతని పేరు థామస్ గా గుర్తించారు. ఈ వ్యక్తి స్థానికుడిగానే చెబుతున్నారు. దర్యాప్తు సంస్థలు నిందితుడి పేరు మాత్రం వెల్లడించలేదు. నిందితుడు ఏఆర్ శ్రేణి సెమీ ఆటోమేటిక్ రైఫిల్ తో ట్రంప్ పై కాల్పులు జరిపాడు. ఆయుధాన్ని కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు ఎత్తైన పొజిషన్లో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది స్లిప్పర్ స్పందించి అతనిపై ఎదురు దాడి చేశాయి. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. మరోవైపు గాయపడి కిందకి వంగిన ట్రంప్ పైకి లేవగానే నేను ఎప్పటికీ లొంగిపోను అని పిడికిలి బిగించి నినాదం చేశారు. ట్రంప్ పై కాల్పులు ఘటనను హత్యాయత్నంగానే భావించి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయాన్ని ఎఫ్బీఐ అధికారికంగా ప్రకటించింది. ట్రంప్ పై దాడి జరగవచ్చని అనుమానంతో ఆయన సీక్రెట్ సర్వీస్ భద్రతను కొనసాగిస్తున్నారు.
దాడిని ఖండించిన పలు దేశాల అగ్రనేతలు..
డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన ఘటనను పలు దేశాలకు చెందిన అగ్ర నేతలు తీవ్రస్థాయిలో ఖండించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ 'తన స్నేహితుడు డోనాల్డ్ ట్రంప్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ రాజకీయాల్లో హింసకు లేదు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోలని ప్రార్థిస్తున్నాను' అని పేర్కొన్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. దేశంలో ఎటువంటి హింసకు లేదన్నారు. పెన్సిల్వేనియాలోని ట్రంప్ ర్యాలీలో జరిగిన కాల్పులు ఘటనపై తనకు సమాచారం వచ్చిందని, ఆయన సురక్షితంగా ఉన్నారన్నారు. ట్రంప్ తోపాటు ర్యాలీలో ఉన్న వారంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హరిస్ కూడా ట్రంప్ పై జరిగిన దాడి ఘటనపై స్పందించారు. ఆయనకు పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదని తెలిసి ఉపశమనం పొందినట్లు పేర్కొన్నారు. ఈ అసహ్యకరమైన చర్యను ఖండించాలని, ఇది మరింత హింసకు దారి తీయకుండా చూసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. వీరితోపాటు అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా తదితరులు స్పందించి దాడిని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ ఘటనపై స్పందించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం ఘటన తనను తీవ్ర ఆందోళన గురి చేసిందన్నారు. ఇలాంటి చర్యలను అత్యంత కఠినంగా ఖండించాలన్నారు.