||ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్||
వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవిపై ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె నమ్మకద్రోహి అని వ్యాఖ్యానించారు. శ్రీదేవి లాంటి నమ్మకద్రోహుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని తెలిపారు. ఇలాంటి వారికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. ‘ఆమె ఉండవల్లి శ్రీదేవి కాదు.. ఊసరవెల్లి శ్రీదేవి. సినీ నటి శ్రీదేవిని మించి నటించారు’ అని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేసేముందు తన కూతురితో కలిసి జగన్‌తో ఫొటో దిగి అభిమానిని అన్నట్టు నమ్మించిందని, ఆ తర్వాత మోసం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే శ్రీదేవి మాట్లాడారని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ఆరోపించారు. దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటేనని మండిపడ్డారు. జగన్‌ను మోసం చేసినవాళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదని పేర్కొన్నారు.