ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసాధారణ స్థాయిలో భద్రత కల్పించడం పట్ల ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ స్థాయిలో ఆయనకు భద్రత కల్పించాల్సిన అవసరం ఏముంది అన్న దానిపై ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం.. తాజాగా వైఎస్ జగన్ కు అసాధారణ స్థాయిలో కల్పిస్తున్న భద్రతపైన దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
జగన్ ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన గ్రిల్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసాధారణ స్థాయిలో భద్రత కల్పించడం పట్ల ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ స్థాయిలో ఆయనకు భద్రత కల్పించాల్సిన అవసరం ఏముంది అన్న దానిపై ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం.. తాజాగా వైఎస్ జగన్ కు అసాధారణ స్థాయిలో కల్పిస్తున్న భద్రతపైన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడ లేని విధంగా మితిమీరిన భద్రత ఏర్పాట్లు చేసుకున్నారంటూ ఇప్పటికే టిడిపి.. ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ భద్రతకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారులకు కీలక ఆదేశాలు వెళ్లినట్టు చెబుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత మాన్యువల్ ఉల్లంఘించారని, సెక్యూరిటీ విషయంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ టిడిపి నేతలు నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా లేనంత భద్రతను జగన్ ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలను టిడిపి చేస్తోంది. జగన్ ప్యాలెస్ వద్ద ఏకంగా 986 మందితో భారీగా భద్రత ఏర్పాటు చేసుకున్నట్లు టిడిపి వర్గాలు ఆరోపించాయి. తాడేపల్లి, హైదరాబాద్, పులివెందులలోని నివాసాల వద్ద ఈ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. తాడేపల్లి పేలస్ చుట్టూ 30 అడుగుల ఐరన్ వాల్ ఏర్పాటు చేసుకున్నారని, భద్రతా నియమాలు ఉల్లంఘించారని టిడిపి వర్గాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ భద్రతపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ సొమ్ముతో భారీ ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడం పట్ల ప్రభుత్వం కీలక సమాచారాన్ని సేకరిస్తోంది. కొద్దిరోజుల్లోనే ఈ సెక్యూరిటీని ప్రభుత్వం తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే జగన్ కు సెక్యూరిటీ కల్పించడాన్ని వైసిపి సమర్ధిస్తోంది. గతంలో వైఎస్ జగన్ పై దాడులు జరిగిన నేపథ్యంలోనే సెక్యూరిటీ అధికారులు హెచ్చరికతోనే వీటిని ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. సీఎం జగన్ ఇంటి చుట్టూ కంచె ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం.. బకింగ్ హామ్ కెనాల్ కాల్వ గట్టు ఎత్తులో ఉండడాన్ని అధికారులు గమనించి స్నైపర్ షాట్స్ ను నిలువరించేలా ఇంటి చుట్టూ ఈ గ్రిల్స్ ఏర్పాటు చేశారని చెబుతున్నారు. దీనిపై సైతం అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై విచారణకు ఆదేశించే అవకాశం ఉందని అధికార వర్గాల నుంచి సమాచారం అందుతోంది.