సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. ఓట్ల లెక్కింపులో రాజకీయ పార్టీల భవితవ్యం తేలిపోనుంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు గత నెల 13న పోలింగ్ జరిగింది. పోలింగ్లో జనం ఎవరి వైపు మొగ్గారో అన్న ఉత్కంఠ అన్ని పార్టీల శ్రేణులను ఊపేస్తోంది.
జగన్, చంద్రబాబు
సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. ఓట్ల లెక్కింపులో రాజకీయ పార్టీల భవితవ్యం తేలిపోనుంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు గత నెల 13న పోలింగ్ జరిగింది. పోలింగ్లో జనం ఎవరి వైపు మొగ్గారో అన్న ఉత్కంఠ అన్ని పార్టీల శ్రేణులను ఊపేస్తోంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజల ఓట్లను మంగళవారం లెక్కించనున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, తెలుగుదేశం పార్టీ జనసేన - బిజెపి -కూటమిగా మరోవైపు, కాంగ్రెస్ పార్టీ వామపక్షాల కూటమి మరోవైపు బరిలోకి దిగాయి. అయితే ప్రధాన పోటీ వైసీపీ - టీడీపీ కూటమి మధ్య కేంద్రీకృతమైందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ ఎన్నికలు అనేక విషయాల్లో ప్రత్యేకత చాటుకున్నాయి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 81.8% పోలింగ్ నమోదయింది.
రాష్ట్రంలో ఇంత వరకు జరిగిన ఎన్నికల్లో ఇంత పోలింగ్ ఎప్పుడు జరగలేదు. పైగా దేశ వ్యాప్తంగా కూడా మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇక పోలింగ్ అనంతరం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉంటే తమ పార్టీ విజయం సాధిస్తుందంటూ పెద్ద ఎత్తున బెట్టింగులు కాస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలు పందాలు రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జరిగాయి. ఇదిలా ఉంటే ఫలితాలకు సంబంధించి ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. మరోసారి తామే అధికారంలోకి వస్తామని వైసిపి నాయకులు చెబుతుండగా.. రాష్ట్రంలోని మెజారిటీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందుతున్నారని కూటమి నేతలు చెబుతున్నారు.