ఆ మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపివేత : ఏపీ డీజీపీ హరీష్ గుప్తా

రాష్ట్రంలో మద్యం విక్రయాలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఈనెల నాలుగో తేదీ కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు డిజీపీ హరీష్ గుప్తా ప్రకటించారు.

AP DGP Harish Gupta

డిజీపీ హరీష్ గుప్తా




రాష్ట్రంలో మద్యం విక్రయాలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఈనెల నాలుగో తేదీ కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు డిజీపీ హరీష్ గుప్తా ప్రకటించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జిల్లో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ కు ముందు రోజు, కౌంటింగ్ రోజు, ఆ తర్వాత రోజు మద్యం అమ్మకాలను నిలిపివేయడం ద్వారా చాలావరకు గొడవలను అదుపు చేయవచ్చని భావించిన పోలీసులు.. ఈ మేరకు విక్రయాలపై ఆంక్షలు తీసుకోవాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని హరీష్ గుప్తా వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ రోజు రాష్ట్రంలోనే పలు ప్రాంతాల్లో ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందన్న ఇంటిలిజెన్స్ అధికారుల హెచ్చరిక నేపథ్యంలో.. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా దాడులకు అవకాశం ఉన్న నేపథ్యంలో.. పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర డిజిపి సూచనల మేరకు బందోబస్తు ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్