కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌ కల్యాణ్‌ శనివారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. పవన్‌ కల్యాణ్‌ వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు భారీగా ఆలయం వద్దకు చేరుకుని ఆయన స్వాగతం పలికారు.

Pawan Kalyan doing puja in Kondagattu

కొండగట్టులో పూజలు చేస్తున్న పవన్ కళ్యాణ్


ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌ కల్యాణ్‌ శనివారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. పవన్‌ కల్యాణ్‌ వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు భారీగా ఆలయం వద్దకు చేరుకుని ఆయన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు పవన్‌ కల్యాణ్‌ ఉదయం హైదరాబాద్‌ నుంచి బయల్దేరి రోడ్డు మార్గంలో బయలుదేరారు. మార్గమధ్యలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తుర్కపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద జనసేన నాయకులు పవన్‌ కల్యాణ్‌కు గజమాలతో సత్కరించారు. పవన్‌ రాక నేపథ్యంలో జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌ బందోబస్తు ఏర్పాట్లును పర్యవేక్షించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాక విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమానులు, జనసైనికులు భారీగా తరలివచ్చారు. అడుగడుగునా ఆయనకు ఘన స్వాగతం పలికారు. 

స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్‌ కల్యాణ్‌కు.. పూజలు అనంతరం వేద ఆశీర్వచనాన్ని పండితులు అందించారు. ఆలయానికి వచ్చిన పవన్‌కు ఆయన అభిమానులు సత్కరించారు. వీరఖడ్గంతో ఆయన ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అనంతరం అభిమానులకు అబివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఏపీ ఎన్నికల్లో జనసేనతో కూడిన కూటమి అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ సారథ్యంలోని జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వంలో చేరిన పవన్‌ కల్యాణ్‌ కీలక మంత్రి పదవులను తీసుకోవడంతోపాటు డిప్యూటీ సీఎంగాను బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన తన మొక్కును తీర్చుకునేందుకు కొండగట్టుకు శనివారం వచ్చారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్