ఏపీలో విద్యార్థులకు పండగ.. తల్లిదండ్రుల అకౌంట్లలో రూ.700 కోట్లు జమ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల||


ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను విడుదల చేశారు. వాహినీ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా దీవెన కార్యాక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వసతి దీవెన పథకం కింద రెండు వాయిదాలలో ఇంజినీరింగ్, మెడిసిన్‌, డిగ్రీ ఇతర కోర్సులు చేసేవారికి రూ.20 వేలు, ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తుంది. పథకం ద్వారా 27 లక్షల మంది పిల్లలకు లబ్ధి పొందుతున్నారు. విద్యాదీవెన నాలుగో విడతను కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. ఇప్పటి వరకు రూ.13,311 కోట్ల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించింది. విద్యార్థులకు విద్యా దీవెనలతో పాటు వసతి జీవన కూడా అందజేస్తున్నామని తెలిపారు. అలాగే పిల్లలకు కాలేజీల్లో ఎలాంటి సమస్యలైనా ఉంటే వెయ్యి 1092 కి ఫిర్యాదు చేస్తే తాము మాట్లాడతామని తెలిపారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్