ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్నారు. మంగళవారం ఉదయం ముందుగా ఆయన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ వెళ్ళనున్నారు. బుధవారం ఉదయం కేంద్ర హోం మంత్రి హామిత్ షా సహా మరి కొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు.
అమిత్ షాతో సీఎం చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫోటో)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్నారు. మంగళవారం ఉదయం ముందుగా ఆయన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ వెళ్ళనున్నారు. బుధవారం ఉదయం కేంద్ర హోం మంత్రి హామిత్ షా సహా మరి కొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు. అదేరోజు రాత్రి రాష్ట్రానికి తిరిగి వస్తారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి అవసరమైన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిగా సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరనున్నారు.
ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, సహకారాన్ని అందించేలా అమిత్ షాను కోరనున్నారు. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు అనుగుణంగా బడ్జెట్లో భారీగా రాష్ట్రానికి కేటాయింపులు చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కోరనున్నారు. వీటితోపాటు గత ప్రభుత్వం పాల్పడిన ఆర్థిక అవకతవకులకు సంబంధించిన అంశాల పైన కేంద్ర హోంమంత్రితో చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రితో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో కీలకమైన ప్రాంతాల మీదుగా జాతీయ రహదారుల నిర్మాణంతోపాటు ఇప్పటికే పూర్తయిన రహదారుల నిర్మాణాలకు సంబంధించిన పలు అంశాలపైన చర్చించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతోపాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తోపాటు ఎంపీలు పాల్గొననున్నారు.